/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/ugadi-pachadi-jpg.webp)
Ugadi
ఉగాది పండుగ నాడు అందరూ కూడా షడ్రురుచుల పచ్చడి తయారు చేస్తారు. ఉప్పు, కారం, తీపి, పులుపు, చేదు, వగరుతో కలిపి ఉగాది పచ్చడిని చేస్తారు. అయితే ఉగాది పచ్చడిని తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Ugadi IPhone Offers: ఉగాది ఆఫర్లు.. IPHONE 15_ 6/512జీబీ ధర భారీగా తగ్గింపు- డోంట్ మిస్!
జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది..
ఉగాది పచ్చడిని బెల్లం (తీపి), చింతపండు (పులుపు), ఉప్పు, వేప పువ్వు (చేదు), మామిడికాయ (వగరు), మిరియాలు (కారం) కలిపి తయారు చేస్తారు. ఈ ఆరురుచులు జీవితంలో సుఖదుఃఖాలను సూచిస్తుంది. వీటిలాగే జీవితంలో వచ్చే కష్టాలను కూడా అలానే తీసుకోవాలని పచ్చడి తింటారు. అయితే ఈ ఉగాది పచ్చడి తయారీలో వాడే వాటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పచ్చడిలోని చింత పండు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఇది కూడా చూడండి: UGADI 2025: క్షణాల్లో ఉగాది పచ్చడి రెడీ .. బ్యాచిలర్స్ కూడా తయారు చేసేయొచ్చు!
మామిడిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే వేప పువ్వులోని పోషకాలు డయాబెటిస్, చర్మ సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే మామిడితో చేసే పచ్చడి శరీరానికి చలవ చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఉగాది పచ్చడిని కేవలం ఆచారాల కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యం కోసం అయినా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Ugadi 2025 Tv Offers: ఉగాది స్పెషల్.. బ్రాండెడ్ 4k TVలపై బ్లాక్ బస్టర్ ఆఫర్లు- వదిలారో మళ్లీ దొరకవ్!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చూడండి: Ugadi 2025: ఉగాది రోజు ఈ రంగు బట్టలు ధరిస్తే ఏడాది అంతా మీకు తిరుగు ఉండదు