ఉగాది రోజు ఈ పనులు చేశారో.. ఏడాదంతా దరిద్రమే

ఉగాది పండుగ రోజు తెలిసో తెలియక కొన్ని పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెబుతున్నారు. కొత్త ఏడాది నాడు ఇంటిని శుభ్రం చేయకూడదు, చిరిగిన దుస్తులు ధరించకూడదు, గొడవలు పడకూడదని పండితులు అంటున్నారు. ఇలా చేస్తే ఏడాదంతా కూడా మీకు దరిద్రమే.

New Update
Ugadi

Ugadi Photograph: (Ugadi)

తెలుగు వారు పవిత్రంగా పూజించే కొత్త సంవత్సరం ఉగాది వచ్చేసింది. మార్చి 30వ తేదీన ఉగాది పండుగను హిందువులు ఘనంగా జరుపుకుంటారు. కొత్త దుస్తులు ధరించి, కుటుంబంతో సరదాగా గడుపుతారు. అయితే కొందరికి తెలియక ఉగాది రోజు చేసే కొన్ని తప్పుల వల్ల ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు. ఉగాది రోజు తెలిసో తెలియక ఈ పనులు చేస్తే మాత్రం ఏడాదంతా మీకు దరిద్రమే. 

క్లీన్ చేయడం

ఇంటిని ఉగాది రోజు అసలు క్లీన్ చేసుకోకూడదు. ముందు రోజే ఇంటిని క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఉగాది రోజు మీరు క్లీన్ చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది. దీంతో ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో కూడా ఇంటిని ఆ రోజు శుభ్రం చేయవద్దు.

ఇది కూడా చూడండి: Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!

బయట పడేయడం
ఇంట్లో  ఉన్న చెత్తను ఉగాది రోజు బయట వేయవద్దు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుందని పండితులు అంటున్నారు. 

చిరిగిన దుస్తులు ధరించడం
కొందరు చిరిగిన దుస్తులు ధరిస్తారు. ఉగాది రోజు ఇలాంటి దుస్తులు ధరించడం అంత మంచిది కాదని పండితులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి:  Israel-Netanyahu: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్‌ కు నెతన్యాహు హెచ్చరికలు!

గొడవలు పడకూడదు
ఉగాది రోజు ప్రశాంతంగా ఉండాలి. ఎక్కువగా ఆలోచించి అసలు గొడవలు పడకూడదని పండితులు అంటున్నారు. ఉగాది రోజు గొడవ పడితే ఏడాది మొత్తం కూడా గొడవ పడతారని పండితులు చెబుతున్నారు. 

మాంసం
కొత్త సంవత్సరం నాడు అసలు మద్యం, మాంసం తీసుకోకూడదని పండితులు చెబుతున్నారు. తీసుకుంటే ఇంట్లో అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ప్రపంచంలో ఉన్న దరిద్రమంతా మీతోనే ఉంటుందని పండితులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Ugadi: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

అప్పులు
కొత్త ఏడాది నాడు అప్పులు ఇవ్వడం, తీసుకోవడం రెండు మంచివి కావు. ఒకవేళ తీసుకుంటే అప్పు తీరదు. ఇస్తే మాత్రం ఆ డబ్బులు తిరిగి వెనక్కి రావని పండితులు చెబుతున్నారు. 

 గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

ఇది కూడా చూడండి: CSK VS RCB: చెన్నై మీద ఆర్సీబీ సూపర్ విక్టరీ..పాయింట్ల పట్టికలో టాప్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు