Brain Stroke: బ్రెయిన్ స్ట్రోక్.. వీటిని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు!

బ్రెయిన్ స్ట్రోక్‌.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను బాధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య. బ్రెయిన్ స్ట్రోక్‌ అనేది ప్రాణాంతకంగా మారవచ్చు. ఈ సమస్య వచ్చాక బాధపడడం కన్నా రాక ముందే లక్షణాలను కనిపెట్టి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

New Update
brain stroke

brain stroke

Brain Stroke: ఇటీవల కాలంలో మన అందరినీ ఎక్కువగా  కలవరపెడుతున్న వ్యాధుల్లో  బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఒకటి. ఇది ఆరోగ్యానికి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. మన శరీరంలో అన్ని అవయవాల లాగానే మెదడు కూడా ఎంతో ముఖ్యమైనది. మెదడు ఆరోగ్యంగా ఉండటం ద్వారా బ్రెయిన్‌ స్ట్రాక్‌ రాకుండా కాపాడుకోవచ్చు. 

Also Read :  వీర్యంతో ముఖ సౌందర్యం.. సెలబ్రిటీల సీక్రెట్ ఇదేనా!

   
అయితే స్ట్రోక్ కు ముందు కొన్ని సూచనలు మన శరీరంలో కనిపిస్తాయి. ఆ లక్షణాలను గమనించి, ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

Also Read :  ఎలుగుబంటిని రక్షించిన భారత సైన్యం

ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. 

బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడానికి నెల రోజుల ముందు నుంచే కొన్ని లక్షణాలను పసిగట్టడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. ముఖ్యంగా ముఖం, కాళ్లు, చేతులు ఒక వైపు మాత్రమే మొద్దుబారడం, కంటి చూపులో తేడా రావడం, శ్వాసలో మార్పులు రావడం, ఛాతీలో నొప్పి రావడం, ముఖ్యంగా ఛాతీలో ఎక్కువగా నొప్పి వచ్చిందంటే స్ట్రోక్‌ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ఎంతో అవసరం.

Also Read :  శీతాకాలంలో ఈ పండు తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు!

స్ట్రోక్‌కు గురైన వారికి సకాలంలో చికిత్స అందించడం ద్వారా మరణించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Rlso Read: ఉదయాన్నే పసుపు నీరు తాగితే అనేక వ్యాధులు దూరం.. వారం చూడండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు