/rtv/media/media_files/2025/01/15/RF6kOWkKkoTKsvHnAyTO.jpg)
Chia Seeds
పోషకాలతో నిండిన చియా సీడ్స్ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. అందుకే వీటిని డైలీ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే. కానీ కావాల్సిన దాని కంటే మాత్రం ఎక్కువగా తీసుకోకూడదు. వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. అయితే వేసవిలో చియా సీడ్స్‌ను ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Trump-Biden: బైడెన్ చేసిన క్షమాభిక్షలు చెల్లవు అంటున్న ట్రంప్!
బాడీలో వేడి ఎక్కువగా ఉండటంతో..
సమ్మర్‌లో చియా సీడ్స్‌ను తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. శరీరంలోని వేడిని తగ్గించి కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వడంలో హెల్ప్ చేస్తాయి. ఎండకాలంలో వేడి వల్ల కాస్త ఒత్తిడి ఉంటుంది. దీన్ని నుంచి బయటపడేలా చియా సీడ్స్ బాగా ఉపయోగపడతాయి. అలాగే శరీరంలో ఎలక్ట్రోలైట్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది.
ఇది కూడా చూడండి: Tulsi Gabbard: భారత్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది
ఇందులోని పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎలక్ట్రోలైట్స్‌ని శరీరానికి అందిస్తుంది. వేసవిలో బాడీ హీట్ వల్ల చాలా మందికి జీర్ణ సమస్యలు వస్తాయి. అదే వీటిని తీసుకుంటే జీర్ణ సమస్యలు అన్నింటికి కూడా చెక్ పెట్టవచ్చు. చియా సీడ్స్‌లోని ఫైబర్ వల్ల మలబద్ధకం వంటి సమస్యలు క్లియర్ అవుతాయి. చియా సీడ్స్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి.
ఇది కూడా చూడండి: IPL 2025: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!
చియాసీడ్స్‌ను వాటర్‌లో కలిపి తీసుకోవచ్చు. లేదా పుడ్డింగ్‌లా తయారు చేసి అయినా కూడా తీసుకోవచ్చు. పాలు, కొబ్బరి పాలు వంటి వాటిలో వేసకుని తినవచ్చు. వీటిని మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే. అధికంగా తీసుకుంటే మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.