/rtv/media/media_files/2025/01/13/ZZG9a9Zv9wruxAlKxMFc.jpg)
bhogi
Sankranti: సంక్రాంతి సంబరాల్లో తొలి రోజు వేడుక భోగి పండుగ. సంప్రదాయ వైభవానికి ఇది వేదిక. సకల దేవతల ఆశీర్వాదాలతో సంపదలు అందిన వేళ ఆ ధనాన్ని, ఆనందాన్ని అందరితో సమష్టిగా ఆస్వాదించాలనే కోరికను భోగి పండుగా సాక్షిగా వ్యక్తమవుతుంది.
Also Read:లాస్ ఏంజిల్స్‌లో ఖరీదైన కార్చిచ్చు.. లక్షల కోట్లు బూడిదపాలు
పంచుకోవడంతోనే సంతోషం పెంచుకోవాలనేది ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. సమస్త సౌభాగ్యాల సమృద్ది- భోగి!..శ్రమశక్తి, దైవకృప, ప్రకృతి అనుగ్రహాల మేలు కలయిక-భోగిపర్వం. జడత్వాన్ని వదిలించుకుని , నవ్యత్వం దిశగా స్ఫూర్తిమంతంగా ముందడుగు వేయాలనేదే భోగి అందించే ఆత్మీయ సందేశం.
మకర సూర్యుడు మనోహరంగా ప్రకాశించడానికి ముందు భోగి మంటల రూపంలో హారతుల్ని అందుకుంటాడు. ఇంద్రుడు వర్షకారకుడై ప్రకృతికి పచ్చదనాన్ని అందించడానికి సిద్దంగా ఉంటాడు. పంటల్ని పుష్కలంగా పండిసత్ఆడు.అందుకు కృతజ్ఙతగా భోగి మంటల్ని ఏర్పాటు చేస్తారు. ఇంద్రుడికి సమర్పించే భోగి మంటను ఇంద్రాగ్నిగా వ్యవహరిస్తారు.
Also Read: Shehbaz Sharif: పాఠశాల విద్యకు దూరంగా పాకిస్థాన్ పిల్లలు.. షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు
భోగిపళ్ల వేడుకతో...
భోగి అంటే విష్ణువు అనే అర్థమూ ఉంది. శ్రీహరిని భోగినాడు భోగేంద్రనాథుడిగా ఆరాధిస్తారు. లోకానికి ప్రాణశక్తిని అనుగ్రహించే సూర్యుణ్ణి వైభోగిగా కీర్తిస్తారు. భోగిపళ్ల వేడుకతో సూర్యారాధనను ఆరంభించి ,రథ సప్తమి వరకు నియమపూర్తకంగా కొనసాగించే సంప్రదాయం ఉంది.
ఉత్తరాయణ పుణ్యకాలానికి భోగి శుభమంగళ తోరణమై వర్థిల్లుతుంది. హేమంత రుతువులో ప్రకృతికి సౌందర్యత్వాన్ని, భోగత్వాన్ని ఆపాదించేది కాబట్టి ఈ పండుగను భోగిగా పేర్కొంటారని సూర్యతంత్రం వివరించింది. రంగనాథుణ్ని పతిగా పొందాలని గోదాదేవి శ్రీవ్రతాన్ని ఆచరించింది.
ఆ సిరినోము పండిన శుభతరుణమే-భోగి. ఆత్మకు గోదాదేవి ప్రతీక. పరమాత్మకు రంగనాథుడు సంకేతం. ఆత్మ పరమాత్ముల సమ్మేళనం మధుర భక్తితో సుసాధ్యమని ఆండాళ్ నిరూపించింది.ద్వాపర యుగంలో నందనందనోత్సవంగా భోగిని నిర్వహించేవారని భాగవతం పేర్కొంది.
భోగిపండుగ నాడే శ్రీకృష్ణుడు గోవర్థనగిరిని ఎత్తి ప్రకృతి వైపరీత్యాల నుంచి గోకులాన్ని రక్షించాడంటారు.అందుకే భోగినాడు గోవర్థనగిరి పూజ చేస్తారు.భోగి సందర్భంగా గొబ్బి గౌరీ వ్రతాన్ని చేస్తారు. ఇంటి ముంగిట అలంకరించే ముగ్గులో పెద్ద గొబ్బెమ్మను, దాని చుట్టూ చిన్న గొబ్బెమ్మలను పెడతారు. ఇవి కృష్ణుడికీ గోపికలకు ప్రతీకలు.
ఈ గొబ్బిళ్లను శ్రీకృష్ణ తత్వానికే కాక, శివలింగ స్వరూపాలకూ సమన్వయం చేస్తారు.గోమయంతో చేసే శివలింగార్చననే-గొబ్బిగౌరీ వ్రతంగా పేర్కొంటారు.భోగిలో ఉన్న అర్థాల్లో సర్పం ఒకటి. కాలాన్ని సర్పంతో పోల్చడం తెలిసిందే. కాలాన్ని సద్వినియోగం చేసుకునే వారికి అంతా లాభం జరుగుతుందని భోగి అంతర్యం.భోగం అంటే ఉత్తమయోగం.
అన్ని పరిణామాలను సాదరంగా స్వీకరిస్తూ , సానుకూలంగా మసలుకోవాలని ఈ పండగ చెబుతుంది. గోవిందుడు, గోదాదేవి,గొబ్బెమ్మలు గోమాత అనే నాలుగు అంశాల నేపథ్యంగా ప్రకృతిలో పూర్ణత్వాన్ని దర్శించాలని, అందుకు భోగినాటి సంప్రదాయాలు అందరికీ ఆదర్శమవుతాయి. నేటి భోగి పండుగ...రేపటి సంక్రాంతికి సంకేతం.
Also Read: TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. సిలబస్, ఎగ్జామ్స్‌పై TGPSC కీలక నిర్ణయం!
Also Read: Game Changer: గేమ్ చేంజర్ బ్లాక్ బాస్టర్.. ఇదిగో ప్రూఫ్, దిల్ రాజు టీం సంచలన వీడియో