/rtv/media/media_files/2026/03/26/sri-rama-navami-2026-03-26-20-16-46.jpg)
Sri rama navami
శ్రీరాముడిపై ఉన్న భక్తి, నమ్మకంతో చాలా మంది రామకోటి రాస్తుంటారు. అయితే పవిత్రమైన శ్రీరామ నవమి రోజున రామ నామాన్ని రాయడం ప్రారంభిస్తే మంచి జరుగుతుందని పండితులు అంటున్నారు. అయితే రామనామాన్ని కోటి సార్లు రాయడాన్నే "రామకోటి" అంటారు. ఈ రెండక్షరాల నామం రాయడం వల్ల ఎన్నో జన్మల పుణ్యం కలుగుతుంది. అలాగే కోటి జన్మల పాపాల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
సాధారణ రోజుల్లో చేసే జపం కంటే శ్రీరామ నవమి వంటి పవిత్ర తిథుల్లో చేసే సాధనకు ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున రామకోటిని ప్రారంభించడం వల్ల సంకల్ప సిద్ధి కలుగుతుంది. మీరు చేపట్టిన పనులు కెరీర్ లక్ష్యాలు లేదా వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడాలని దృఢ నిశ్చయంతో రాముడిని ప్రార్థించి మొదటి అక్షరం రాస్తే ఆ కార్యాలు విజయవంతమవుతాయి. రామ నామ స్మరణలో ఉన్న శక్తి మనస్సులోని నెగటివ్ ఆలోచనలను తొలగించి ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఏకాగ్రతతో రామకోటి రాయడం వల్ల మెదడు ప్రశాంతత పొంది ఒత్తిడి తగ్గి మానసిక స్థిరత్వం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: ఇండియాకు ఇరాన్ గుడ్‌న్యూస్.. 5 మిత్రదేశాలకు హర్మూజ్ జలసంధి పర్మిషన్
పుణ్యం ప్రాప్తిస్తుందని..
"కోటి జన్మల పాపమైనా రామ నామ స్మరణతో నశిస్తుంది" అనేది పురాణోక్తి. మనం తెలియక చేసిన దోషాలు, మనసును వేధించే గత స్మృతుల నుంచి విముక్తి పొందడానికి రామకోటి ఒక అద్భుతమైన మార్గం. రామ నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు లోపల ఉన్న గాలి బయటకు రావడం ద్వారా పాపాలు నశిస్తాయని, నోరు మూసుకున్నప్పుడు గాలి లోపలికి వెళ్లడం ద్వారా పుణ్యం ప్రాప్తిస్తుందని ఆధ్యాత్మిక రహస్యం చెబుతోంది. ఇది కేవలం భక్తి మాత్రమే కాదు, ఒక రకమైన శ్వాస ప్రక్రియ లాగా పనిచేసి శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
ఇది కూడా చూడండి: హిందూ మహాసముద్రంలో చైనా ‘సైలెంట్’ వార్.. భారత్ తీరంలో డ్రాగన్ నౌకల నిఘా!
ఇంట్లో కూర్చుని రామకోటి రాస్తున్నప్పుడు ఆ ప్రదేశమంతా సాత్విక ప్రకంపనలతో నిండిపోతుంది. దీనివల్ల గృహంలోని వాస్తు దోషాలు లేదా ఇతర నెగటివ్ శక్తులు తొలగిపోయి గృహ శాంతి కలుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. రామకోటి రాసే సమయంలో మనస్సు భగవంతునిపై లగ్నం కావడం వల్ల అనవసరమైన గొడవలు, కోపతాపాలు తగ్గి మనిషి ప్రశాంతంగా మారతాడు. అందుకే జీవితంలో క్లారిటీ లేనప్పుడు లేదా అయోమయంలో ఉన్నప్పుడు రామ నామమే సరైన మార్గదర్శిగా నిలుస్తుంది. శ్రీరామ నవమి నాడు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి పూజ గదిలో దీపారాధన చేసి సీతారామచంద్రులను ధ్యానిస్తూ రామకోటి ప్రారంభించాలి. దీని కోసం ప్రత్యేకంగా లభించే రామకోటి పుస్తకాలను లేదా ఒక తెల్లటి నోట్ పుస్తకాన్ని ఉపయోగించవచ్చు. ప్రతిరోజూ కనీసం 108 సార్లు లేదా వీలును బట్టి రాయాలి.
ఇది కూడా చూడండి: Vande Bharat Express: పెరుగులో పురుగులు.. ఇండియన్ రైల్వేస్‌కు భారీ జరిమానా
Follow Us