Sri Rama Navami 2026: పవిత్రమైన శ్రీరామ నవమి.. ఈ వస్తువులు ఇంటికి కొని తీసుకొస్తే డబ్బే డబ్బు

శ్రీరామ నవమి పండుగను దేశ వ్యాప్తంగా మార్చి 27వ తేదీన జరుపుకోనున్నారు. అయితే ఈ శ్రీరామనవమి రోజున కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభించి, ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనం వృద్ధి చెందుతుందని పండితులు చెబుతున్నారు.

author-image
By Kusuma
New Update
Sri rama navami

Sri rama navami

శ్రీరామ నవమి పండుగను దేశ వ్యాప్తంగా మార్చి 27వ తేదీన జరుపుకోనున్నారు. రాముడు పుట్టిన ఈ రోజున ఎంతో ఘనంగా సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు. అయితే ఈ శ్రీరామనవమి రోజున కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభించి, ఆర్థిక ఇబ్బందులు తొలగి ధనం వృద్ధి చెందుతుందని పండితులు చెబుతున్నారు. మరి ఆ వస్తువులు ఏంటో పూర్తి వివరాల్లో తెలుసుకుందాం. 

ఇది కూడా చూడండి: హిందూ మహాసముద్రంలో చైనా ‘సైలెంట్’ వార్.. భారత్ తీరంలో డ్రాగన్ నౌకల నిఘా!

రామ పట్టాభిషేక పటం

శ్రీరామ నవమి రోజున సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమంతులతో కూడిన రామ పట్టాభిషేక పటాన్ని కొని తెచ్చుకోవడం అత్యంత శుభప్రదమని పండితులు అంటున్నారు. ఒకవేళ పటం ఇప్పటికే ఉంటే శ్రీరాముడి ముద్ర ఉన్న ఒక వెండి నాణేన్ని కొని పూజ గదిలో ఉంచండి. ఇది ఇంట్లో రాజయోగాన్ని కలిగించడంతో పాటు ధన ప్రవాహాన్ని పెంచుతుందని పండితులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: ఇండియాకు ఇరాన్ గుడ్‌న్యూస్.. 5 మిత్రదేశాలకు హర్మూజ్ జలసంధి పర్మిషన్

దక్షిణావర్త శంఖం

శంఖం లక్ష్మీదేవికి సోదరుడి వంటిది. నవమి నాడు దక్షిణావర్త శంఖాన్ని కొని ఇంటికి తీసుకువస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. అందులో పాలు లేదా గంగాజలంతో అభిషేకం చేసి పూజిస్తే ఇంట్లోకి దరిద్రం, దుష్ట శక్తులు రావని అంటున్నారు. దీనివల్ల అష్ట ఐశ్వర్యాలు వస్తాయని నమ్ముతున్నారు.

శ్రీయంత్రం లేదా కుబేర యంత్రం

ఆర్థిక పరమైన ఇబ్బందులతో సతమతమయ్యేవారు శ్రీరామ నవమి రోజు శ్రీయంత్రాన్ని లేదా కుబేర యంత్రాన్ని కొని ఇంటికి తెచ్చుకోవాలి. దీనిని పూజ గదిలో స్థాపించి క్రమం తప్పకుండా పూజించడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: Vande Bharat Express: పెరుగులో పురుగులు.. ఇండియన్ రైల్వేస్‌కు భారీ జరిమానా

పసుపు కొమ్ములు, కుంకుమ

మంగళకరమైన పసుపు కొమ్ములను ఈ రోజు కొత్తగా కొని తెచ్చుకోవాలి. వీటిని ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి మీ బీరువాలో లేదా ధనం ఉంచే చోట ఉంచడం వల్ల అనవసరపు ఖర్చులు తగ్గి, సంపద నిలకడగా ఉంటుందని పండితులు అంటున్నారు.

కొత్త మట్టి కుండ

శ్రీరామ నవమి రోజు కొత్త మట్టి కుండను ఇంటికి తీసుకురావడం వల్ల సంపద వృద్ధి చెందుతుందని పండితులు చెబుతున్నారు. రాముడికి పానకం తయారు చేసి ఇందులో పెట్టి నైవేద్యంగా పెట్టడం వల్ల మంచిదని అంటున్నారు.  అయితే వీటిని అభిజిత్ లగ్నంలోనే కొనుగోలు చేయడం మంచిది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 నిమిషాల వరకు ఈ లగ్నం ఉంటుంది. ఈ సమయంలో కొనుగోలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు