Smoking Habit: ఒక్క సిగరెట్ తాగితే.. 20 నిమిషాల లైఫ్ కట్..!

స్మోకింగ్ ఆయుష్షుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది, ప్రతి సిగరెట్ తాగినప్పుడు సగటున 20 నిమిషాల జీవిత కాలం తగ్గుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. స్మోకింగ్ అలవాటు త్వరగా మానుకుంటే మాత్రమే జీవన నాణ్యతను మెరుగుపరచుకోవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

New Update
smoking habit

smoking habit

Smoking Habit: స్మోకింగ్ అలవాటు ఉన్నవారికి ఇది నిజంగా షాకింగ్ న్యూస్. ఇప్పటివరకు స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరమని మాత్రమే తెలుసు. కానీ తాజాగా జరిగిన పరిశోధనల్లో, ఈ అలవాటు మన ఆయుష్షుపై ఎంతగానో ప్రభావం చూపుతుందని భయంకరమైన నిజాలు వెల్లడయ్యాయి.

Also Read: పుష్ప స్టైల్లో నితీశ్ రెడ్డి.. వీడియో చూస్తే గూస్‌బంప్స్ రావాల్సిందే!

ధూమపానం చేసే వాళ్లు సిగరెట్ తాగినప్పుడు వచ్చే కిక్కు కోసం ఈ అలవాటును మానడం చాలా కష్టంగా భావిస్తారు. అయితే, ఈ కిక్కు వెనుక ఉన్న ప్రమాదం జీవితానికి చాలా పెద్ద దెబ్బతీస్తుంది. చాలా మంది చైన్ స్మోకర్స్ బాడీ లోపల పార్ట్ లు పోయే రేంజ్ లో స్మోకింగ్ అలవాటు(Smoking Habit) చేసుకుంటారు. కానీ తాజాగా వెలుగు చూసిన నివేదికలు, ఆరోగ్యం పూర్తిగా చెడిపోయిన తర్వాత ధూమపానం మానడం పెద్దగా ప్రయోజనం ఇవ్వదని చెబుతున్నాయి.

Also Read: స్టుపిడ్‌ షాట్.. గెట్‌అవుట్ ఫ్రమ్ డ్రెస్సింగ్ రూమ్: సన్నీ ఫైర్

20 నిమిషాల లైఫ్ కట్..!

సమయానికి స్మోకింగ్ మానేయగలిగితే మాత్రం లైఫ్ టైం మెరుగుపరచుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అద్భుతమైన నిజం ఏమిటంటే, ప్రతి సిగరెట్ తాగినప్పుడు మన ఆయుష్షులో సగటున 20 నిమిషాలు తగ్గుతుందట. ఈ విషయాన్ని పరిశోధనలు స్పష్టంగా నిరూపించాయి.

Also Read: Pushpa-2: పుష్ప–2 నిర్మాతలకు భారీ ఊరట–అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు

పురుషులు, మహిళలు ఇద్దరూ ఈ అలవాటు బారిన పడుతుండగా, పురుషులలో సిగరెట్ తాగడం జీవనకాలం మీద మరింత తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని నివేదికలు చెబుతున్నాయి. సిగరెట్ తాగడం వల్ల పురుషుడి ఆయుష్షు సగటున 17 నుండి 22 నిమిషాల వరకు తగ్గుతుందని తాజా అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ షాకింగ్ నిజాలు, పొగత్రాగే అలవాటు ఉన్న వారిని మానేందుకు ప్రేరేపించవచ్చు.

Also Read: ఆ సమాయానికి మోదీ ప్రభుత్వం ఉండకపోవచ్చు.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Summer Tips: సమ్మర్ లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే డేంజర్

వేసవి కాలంలో ఎండ తీవ్రత వల్ల డీహైడ్రేషన్, అలసట, చర్మ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇలాంటి సమయంలో కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

New Update
summer tips

summer tips

Summer Tips: వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరగడం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎండ తీవ్రత వల్ల డీహైడ్రేషన్, అలసట, చర్మ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు.  అందుకే ఈ కాలంలో సరైన జీవనశైలి అలవాటు చేసుకోవాలి.

సరైన జీవనశైలి అలవాట్లు

  • వేసవిలో నీటిని ఎక్కువగా తీసుకోవడం చాలా అవసరం. రోజుకు కనీసం 3–4 లీటర్లు నీళ్లు తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచవచ్చు. మజ్జిగ, కొబ్బరి నీరు, తాటిపండు, దోసకాయ వంటి తండ్రీ ఆహార పదార్థాలు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. 
  • బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తెలుపు లేదా లేత రంగుల దుస్తులు ధరించడం మంచిది. టోపీలు, గ్లాసెస్ వంటివి వాడడం వలన ఎండ నుంచి రక్షణ లభిస్తుంది. సూర్యుడి కిరణాలు ఎక్కువగా ఉండే మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉండటం ఆరోగ్యానికి మంచిది. ఉదయం లేదా సాయంత్రం మాత్రమే అవసరమైన పనుల కోసం బయటకు వెళ్లడం ఉత్తమం. 
  • వేసవిలో ఆహారం మితంగా తీసుకోవడం, పచ్చి కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు. వేసవిని సురక్షితంగా, ఆరోగ్యంగా గడపాలంటే ఈ మార్పులు అనుసరించడం అవసరం.

Summer Tips: శరీరంలో నీటి కొరత ఉంటే ఈ రోగాలు చుట్టుముడతాయి.. జాగ్రత్త!

 నిద్ర, విశ్రాంతి 

  • వేసవిలో వేడి ప్రభావం శరీర శక్తిని తగ్గిస్తుంది. ఎక్కువ ఉష్ణోగ్రతల కారణంగా శరీరం  త్వరగా అలసిపోతుంది.  అలాంటి సమయంలో శరీరానికి తగిన విశ్రాంతి చాలా ముఖ్యం. ప్రతిరోజూ కనీసం 7–8 గంటల నిద్ర తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. 
  • తీవ్ర మైన ఎండల  సమయంలో ఎయిర్ కండిషనర్ లేదా ఫ్యాన్ ఉపయోగించడం వల్ల నిద్రలో అంతరాయం కలగదు. మధ్యాహ్న సమయంలో 15–30 నిమిషాలు విశ్రాంతి తీసుకోవడం శరీరాన్ని ఫ్రెష్‌గా ఉంచుతుంది. 
  • వేసవిలో ఎక్కువ పని చేయడం వల్ల తలనొప్పులు, నీరసం వంటి సమస్యలు ఎదురవుతాయి. వాటిని నివారించాలంటే తగినంత నిద్ర చాలా అవసరం. 
  • శరీరం మానసికంగా, శారీరకంగా రిఫ్రెష్ అవ్వాలంటే విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి. వేడి ప్రభావం తగ్గించడానికి గది శుభ్రంగా ఉంచడం,   ప్రాపర్ వెంటిలేషన్  ఉండేలా చూసుకోవాలి.  వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర,   విశ్రాంతిని నిర్లక్ష్యం చేయకూడదు.

latest-news | telugu-news | summer-tips | life-style

Advertisment
Advertisment
Advertisment