/rtv/media/media_files/2025/01/12/dYjbqRrjhmqlFcZ4JkMR.jpg)
sabarimala Temple
శబరిమల వెళ్లే భక్తులకు ఇది శుభవార్త. దేవస్థానం బోర్డు చేయబోతున్న ఓ మార్పు వల్ల భక్తులు ఎక్కువ సెకన్ల పాటు అయ్యప్ప స్వామిని దర్శించుకోవచ్చు. అయ్యప్ప స్వామిని దర్శించుకునే మార్గాన్ని మార్చాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంది. దేవుని సన్నిధిలోని పవిత్రమైన 18 మెట్లు ఎక్కిన భక్తులు డైరెక్ట్‌గా దేవుని దర్శనానికి వెళ్తారని ట్రావెన్‌కోర్ దేవస్థానం తెలిపింది. అయితే ఈ కొత్త రూట్ దర్శనం మార్చు15వ తేదీ నుంచి అమలు అవుతుంది.
ఇది కూడా చూడండి: Lalit Modi: 'వనువాటు అందమైన దేశం'.. లలిత్ మోదీ సంచలన పోస్ట్
#Sabarimala
— Saravanaprasad Balasubramanian (Modi ka Pariwar) (@BS_Prasad) March 6, 2025
வரும் பங்குனி மாதம் ஐயனின் நடை திறக்கும் போது 18ம் படி ஏறியவுடன் நேராக ஐயனை தரிசனம் செய்யலாம்.
இனி ஒரு நொடி தரிசனம் எல்லாம் இல்லை ஒருவருக்கு குறைந்தது ஆறு நிமிடம் தரிசனம்.
இதற்கு தேவையான 15 மீட்டர் புதிய கியு நடைமுறைக்கான வேலைகள் நடைபெறுகிறது. pic.twitter.com/ytsANzSmyZ
ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారికి అసలు బాలేదు..కాస్త జాగ్రత్తగా ఉండండి!
12 రోజుల పాటు కొత్త మార్గంలో..
విషుపూజ సందర్భంగా 12 రోజుల పాటు కొత్త మార్గంలోనే అయ్యప్ప దర్శనం కొనసాగుతుందని టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ ప్రకటించారు. ఇది కనుక విజయవంతమైతే శాశ్వతంగా అమలు చేస్తామని తెలిపారు. పవిత్రమైన మెట్లు ఎక్కిన తర్వాత దర్శనం మంచిగా దర్శనం కావాలని భక్తుల నుంచి బోర్డుకు అభ్యర్థనలు వచ్చాయి. ఈ క్రమంలోనే అయ్యప్ప స్వామి దర్శన మార్గాన్ని మారుస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇది కూడా చూడండి: Elan Musk: ఎక్స్ సేవల్లో అంతరాయం..ఇది భారీ సైబర్ దాడే అంటున్న మస్క్!
ప్రస్తుతం 18 మెట్లు ఎక్కిన తర్వాత దర్శనం కోసం వంతెన దగ్గరకు పంపించి క్యూలైన్‌లో కూర్చోబెడతారు. ఆ తర్వాత దర్శనం కోసం అవతలి వైపుకు పంపుతారు. ఈ పద్ధతి వల్ల ఐదు సెకన్లు మాత్రమే దర్శనం భాగ్యం కలుగుతుంది. దీనివల్ల 80 శాతం మంది అయ్యప్ప భక్తులు సంతృప్తి చెందడం లేదని అభ్యర్థనలు రావడంతో మార్పులు చేశారు.