లైంగిక ప్రక్రియ.. భార్య భర్తల జీవితంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అదే సమయంలో ఈ ప్రక్రియలో పాల్గొనే ముందు ఇరువురి పరస్పర అంగీకారం ఎంతో అవసరం. కానీ కొందరు ఈ విషయాన్ని కొట్టిపారేస్తుంటారు. భాగస్వామి అభిప్రాయం తెలుసుకోకుండా.. వారి ప్రాధాన్యతలతో అవసరం లేకుండానే లైంగికంగా పాల్గొంటారు. మొరటుగా ప్రవర్తించకూడదు ఇలా చేయడం మహిళల కోపం, ద్వేషానికి దారి తీసే అవకాశం ఉంటుంది. ఇది మహిళలకు ఎంతో చిరాకుగానూ, అసహ్యంగానూ అనిపించవచ్చు. కొందరు భర్తలైతే తమ భార్య అనుమతి లేకుండానే మొరటుగా ప్రవర్తిస్తారు. భాగస్వామితో మాట్లాడకుండానే అతి దారుణంగా లైంగిక ప్రక్రియలో పాల్గొంటారు. అలాంటి వారిని మహిళలు ఇష్టపడరు. Also Read: రైతులకు శుభవార్త.. పంట బీమా పథకాలను పొడిగించిన కేంద్రం భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి అంతేకాకుండా పడకగదిలో భర్తలు చేసే తప్పులు భార్యలకు కోపం తెప్పిస్తాయి. తమ భాగస్వామితో మాట్లాడకుండా నేరుగా శృంగారం చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారిని కూడా మహిళలకు ఇష్టపడరు. వీటితో పాటు లైంగిక ప్రక్రియ సమయంలో శుభ్రమైన బట్టలతో ఉండే పురుషులను మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే తమ భావోద్వేగాలను అర్థం చేసుకునే ఓపిక గల భర్తలపై ఆసక్తి చూపిస్తుంటారు. Also Read: బోర్‌వెల్‌లో పది రోజులు ఉన్న పాప..రెస్క్యూ చేసిన తర్వాత మృతి అయితే మహిళలు శారీరకంగానే కాకుండా మానసికంగానూ తమ భాగస్వామితో కనెక్ట్ అవ్వాలని ఎంతో కోరుకుంటారు. ఇక శృంగారం ముందు తమతో సరదాగా మాట్లాడి, నవ్వించడం ద్వారా భార్యల మనసు దోచుకోవచ్చు. అయితే ఆ సరదా మాటలు హద్దులు దాటకూడదు. ఒకవేళ హద్దులు దాటాయంటే అది తొలి నిరాశకు దారి తీస్తుంది. అభిప్రాయం అవసరం అందువల్లనే పడకగదిలో మహిళలతో ఎప్పుడు కూడా ఆనందంగా, సరదా సరదాగా, వారి అభిప్రాయాలను తెలుసుకుని, వారి ఆసక్తికి అనుగుణంగా మాట్లాడాలి. అలాంటి వారినే వారూ ఇష్టపడతారు. ఇక లైంగిక ప్రక్రియలో పాల్గొనే ముందు భాగస్వామి అభిప్రాయం చాలా అవసరం. వారి భావాలను గుర్తించి ఇష్టం అయితే ఆ ప్రక్రియలో పాల్గొనాలి. ఒప్పుకోకపోతే ఒప్పుకునే వరకు ఒప్పించాలి. అంతేగాని మొరటుగా ప్రవర్తించకూడదు. Also Read: న్యూఇయర్ రోజు అమెరికాలో మరో అటాక్..న్యూయార్క్ నైట్ క్లబ్‌లో కాల్పులు.. మహిళలకు అది నచ్చదు ఇక చాలా మంది శృంగారంలో పాల్గొన్న తర్వాత తమ భాగస్వామిని పట్టించుకోరు. లైంగిక ప్రక్రియ అనంతరం నిద్రపోతారు. అది మహిళలకు నచ్చదు. అందువల్ల అలా చేయకుండా కాసేపు తమ భాగస్వామితో ఉల్లాసంగానూ, రొమాంటిక్‌గానూ మాట్లాడే వ్యక్తులంటే మహిళలు పడిచచ్చిపోతారు. అందువల్ల పడకగదిలోకి వెళ్లే ముందు, వెళ్లిన తర్వాత వీటికి అనుసరిస్తే ఇద్దరి మధ్య బాండింగ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. గమనిక: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు, సూచనల కోసం పండితులను సంప్రదించగలరు.