/rtv/media/media_files/2025/03/24/f0mShobTWcRBm47nqFKX.jpg)
Retro walking Photograph: (Retro walking)
ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది వాకింగ్ చేస్తుంటారు. కానీ సాధారణ వాకింగ్ కంటే రివర్స్ వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కొందరికి రివర్స్ వాకింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. రివర్స్ వాకింగ్ అంటే రెట్రో వాకింగ్. ట్రాక్, ట్రెడ్ మిల్ లేదా నేలపై ముందుకు కాకుండా వెనక్కి నడవడాన్ని రివర్స్ వాకింగ్ అంటారు.
ఇది కూడా చూడండి: Delhi Railway station : ట్రైన్ల ఆలస్యంతో కిక్కిరిసిన ఢిల్లీ రైల్వే స్టేషన్!
మెదడు పనితీరు మెరుగుపడుతుందని..
ఈ రివర్స్ వాకింగ్ చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మెదడు పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు కీళ్ల సమస్యలను కూడా తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. రివర్స్ వాకింగ్ చేస్తే ఆర్ధోపెడిక్ సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. ఈ రివర్స్ వాకింగ్ చేయడం మొదట్లో కాస్త కష్టంగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత అలవాటు పడితే బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయట.
ఇది కూడా చూడండి: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి
మోకాళ్ల నొప్పులతో ఎక్కువగా ఇబ్బంది పడేవారు ఈ రివర్స్ వాకింగ్ చేయడం మంచిదని నిపుణలు అంటున్నారు. వెనక్కి నడవడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. అలాగే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఏ విషయంపైనా అయినా కూడా దృష్టి పెట్టగలరు. ఒత్తిడి తగ్గి మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. కండరాలు అన్ని కూడా సక్రమంగా పనిచేస్తాయి. శస్త్ర చికిత్స చేసుకున్న వారు ఈ వాకింగ్‌ను నెమ్మదిగా చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Viral video: ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!