/rtv/media/media_files/2025/03/14/nREBZ6gRwxk5KpU0d82w.jpg)
parenting tips for children
Parenting Tips: నేటి బిజీ లైఫ్ లో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేయడంతో ఇంట్లో పిల్లల చూసుకోవడం సమస్యగా మారుతోంది. వారి కోసం పేరెంట్స్ సరైన సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో పిల్లలను ఇంట్లోనే ఒంటరిగా వదిలేసి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే మీ పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్ళేటప్పుడు.. వారి భద్రత కోసం కొన్ని విషయాలను గుర్తించుకోవడం చాలా ముఖ్యం. అవేంటో ఇక్కడ తెలుసుకోండి..
ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?
అత్యవసర నెంబర్లు
పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలివెళ్లేటప్పుడు.. వారిని క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొనేందుకు సిద్ధం చేయండి. అవసరమైనప్పుడు సంప్రదించడానికి మీ నెంబర్ లేదా 1-2 విశ్వసనీయ వ్యక్తుల నెంబర్లను వారికి ఇవ్వండి. అంతేకాకుండా పోలీస్, అంబులెన్స్ వంటి వంటి అత్యవసర సేవల నంబర్లను కూడా అందుబాటులో ఉంచండి.
ఆహరం..
బయటకు వెళ్లేముందు పిల్లల ఆహారం, ఇతర పానీయాల కోసం పూర్తి ఏర్పాట్లు చేయండి. పిల్లలు పదే పదే ఆకలిగా భావిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు తిరిగి వచ్చే వరకు అతనికి/ఆమెకు ఆహారం, నీటి కొరత లేకుండా చూసుకోండి. అన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో లేదా వంటగదిలో సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. అలాగే, పిల్లలకు హాని కలిగించే వస్తువులను వారికి అందకుండా దూరంగా ఉంచండి.
ఏదైనా పని ఇవ్వండి
పిల్లవాడు బోర్ ఫీల్ అవ్వకుండా బిజీగా ఉంచడానికి అతనికి ఏదైనా పని ఇవ్వండి. దీని కోసం, మీరు పిల్లలు అందమైన డ్రాయింగ్ వేయమనడం లేదా అతనికి ఇష్టమైన పుస్తకం ఇచ్చి చదవమని చెప్పడం చేయండి. ఇది కాకుండా, పిల్లవాడు రోజంతా బిజీగా ఉండేలా వారికి ఇష్టమైన బొమ్మలను ఉంచవచ్చు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: రాజలింగం హత్య వెనుక కేసీఆర్, కేటీఆర్, హరీశ్.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు!