కిడ్నీ ఇచ్చిన భార్య.. లివర్ ఇచ్చిన కొడుకు..హైదరాబాద్ లో అరుదైన సర్జరీ!

ఒంగోలుకి చెందిన ఓ 54 ఏళ్ల వ్యాపారవేత్తకు కిడ్నీలతో పాటు కాలేయం పాడైంది. దీంతో చావు బతుకుల్లో ఉన్న ఆయనకు భార్య కిడ్నీ దానం చేయగా.. కుమారుడు లివర్ లోని కొంత బాగం ఇచ్చాడు. హైదరాబాద్ స్టార్ ఆస్పత్రి వైద్యులు కిడ్నీ, కాలేయ మార్పిడిని విజయవంతంగా పూర్తి చేశారు.

New Update
Organ donation

AP NEWS

AP NEWS: అన్ని దానాల్లోకేళ్ల ఆవయవాల దానం చాలా గొప్పది అంటారు. అవయవ దానం అనేది మరణించబోయే వ్యక్తి శరీర అవయవాలు వేరొకరికి అమర్చడానికి ఇవ్వడం. దీని వలన ఆయా అవయవాలు విఫలమై రోగగ్రస్తులైన వారు పునర్జీవితులవుతారు. తాజాగా ఓ కుటుంబం అందరికి ఆదర్శంగా నిలిచారు. ఇంటి పెద్దకు కిడ్నీ, కాలేయం సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో ఆ కుటుంబం తల్లడిల్లి పోతున్నారు. రెండు కీలక అవయవాలు చెడిపోయిన ఇంటి పెద్దను ఎలగైనా బతికించుకున్న కుటుంబం నిర్ణయించుకుంది. వాటిని ఎవరైనా దానం చేస్తే తప్ప ఆయన అనారోగ్య సమస్యల నుంచి బయటపడలేరు.

ఇది కూడా చదవండి: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జనవరి నుంచే ఉచిత భోజనం

కుటుంబ సభ్యుల త్యాగం:

అయితే వైద్యులు చెప్పిన మాటలు విన్న కుటుంబ సభ్యులు అతనిని ఎలాగైనా బతికించుకోవాలని అనుకున్నారు. భార్య, కుమారుడు అవయవాలను దానం చేయాడానికి సిద్ధమైయ్యారు. దీంతో ఆ ఇంటి పెద్ద అనారోగ్య సమస్య నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడ్డారు. ఏపీలోని ఒంగోలుకు చెందిన ఓ కుటుంబ సభ్యుల త్యాగం చేసిన తీరుతో అందరికి ఆదర్శంగా నిలిచారు. ఈ విషయంపై నానక్‌రాంగూడలోని స్టార్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్లు వెలిపారు.  

ఒంగోలుకి చెందిన వ్యాపారవేత్త 54 ఏళ్ల రామారావు కాలేయం, కిడ్నీ  సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్నారు. అతేకాకుండా ఇతనికి మధుమేహం, అధిక రక్తపోటు, హెపటైటిస్-బి ఇన్ఫెక్షన్‌ వంటి సమస్యలు కూడా ఉన్నాయి. కాలేయం పూర్తిగా చెడిపోగా.. కిడ్నీలు ఫెయిల్‌ అవ్వడంతో రక్తంలో విష పదార్థాలు పేరుకుపోయాయని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు అతనిని స్టార్‌ ఆస్పత్రిలో జాయిన్ చెపించారు. రామారావును పరీక్షించిన డాక్టర్లు వెంటనే కాలేయం, మూత్రపిండాలను మార్చాలని చెప్పారు.  దీంతో అతని భార్య నాగవల్లి, కొడుకు కౌశిక్‌ అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చారు. నాగవల్లి నుంచి కిడ్నీని, కౌశిక్‌ కాలేయం నుంచి కొంత భాగం తీసి రోగికి అమర్చారని స్టార్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.  ఇంటి పెద్దను బతికించుకోన్న  కుటుంబం సాహనం చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. 

ఇది కూడా చదవండి: క్రిస్మస్‌కి పిల్లలకు ఈ బహుమతులు ఇవ్వండి

ఇది కూడా చూడండి:  బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజులు అతి భారీ వర్షాలు

ఇది కూడా చూడండి: సైబర్ నేరాలు అరికట్టేందుకు కీలక ప్రాజెక్టు ప్రారంభించిన పోలీసులు 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు.

New Update

ఏపీ, తెలంగాణలో  రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ సమీపంలోని ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. సోమవారం పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని.. వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రైతులు చెట్ల కింద నిల్చోవద్దని చెప్పారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా ఇప్పటికే అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినడా, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు. ఏపీలో అత్యధికంగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీ మీటర్ల వాన పడినట్లు పేర్కొన్నారు.

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

  telugu-news | rtv-news | rains | heavy-rains 

Advertisment
Advertisment
Advertisment