/rtv/media/media_files/2025/02/20/7RSjTksgFy3bsC6oPw4l.jpg)
Maha Shivratri 2025
Maha Shivratri 2025: మహాశివరాత్రి హిందువులకు చాలా ప్రత్యేకమైన పండుగలలో ఒకటి. మాఘమాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే చతుర్దశ రోజున మహాశివరాత్రి జరుపుకుంటారు. ఈ ఏడాది 26-02-2025 బుధవారం రోజున మహాశివరాత్రి వచ్చింది. మహా శివరాత్రి రోజున భోలేనాథుడికి పూజలు, ఉపవాసం చేయడం ద్వారా మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అయితే శివరాత్రి రోజున కొన్ని పనులు చేయడం ద్వారా ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడడమే కాకుండా మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి..
దానం చేయడం
మతపరమైన పండగలు లేదా ఆరాధనలో దానధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. మహాశివరాత్రి లాంటి పర్వదినం రోజున అవసరంలో ఉన్నవారికి, పేదలకు దానధర్మాలు చేయడం ద్వారా భగవంతుడి కటాక్షం లభిస్తుంది. మానవ సేవే మాధవ సేవ.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం కూడా దేవుడికి సేవ చేయడంతో సమానం.
ఉపవాసం
మహాశివరాత్రి రోజున చాలా మంది భక్తులు ఉపవాసం ఉంటారు. ఇది మతపరమైన దృక్కోణం నుంచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉపవాసం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలను శాస్త్రంలో కూడా ప్రస్తావించారు. ఏమీ తినకుండా శరీరానికి 24 గంటలు విశ్రాంతి ఇవ్వడం ద్వారా రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించడం, చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయాడతాయి.
మంత్రం వేయడం
మహాశివరాత్రి రోజున 'ఓం' జపించడం శుభ ఫలితాలను కలిగిస్తుంది. 'ఓం' అనేది 'విశ్వం యొక్క శబ్దం' అని అర్థం. మతపరమైన డుక్కోణంతో పాటు ఓం జపించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఓం జపించడం ద్వారా కోపం, ఒత్తిడి, నిరాశ, ఆందోళన వంటి ప్రతికూల భావోద్వేగాలు తొలగిపోతాయి.
చల్లని నీటితో స్నానం
మహాశివరాత్రి పర్వదినాన్ని చల్లని నీటితో స్నానం చేయడం ద్వారా ప్రారంభించాలి . అనేక అధ్యయనాలు చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల ఏకాగ్రత శక్తి పెరుగుతుందని నిర్ధారించాయి. దీంతో పాటు శరీరంలో ఆక్సిజన్ స్థాయి కూడా పెరుగుతుంది. శరీరంలో శక్తిని పెంచుతుంది. ఇది మీ ఆధ్యాత్మిక వృద్ధికి, అలాగే శరీరానికి మంచిది.
ధ్యానం చేయడం
ఉదయాన్నే శివ మంత్రం జపిస్తూ ధ్యానం చేయండి. ఇది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఆధ్యాత్మికతను కూడా పెంపొందిస్తుంది. పురాతన కాలం నుంచి అనేక మత సంప్రదాయాలలో ధ్యానం ఆచరించబడుతోంది. మతపరమైన అంశాలతో పాటు ధ్యానం చేయడం ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరం. ప్రతిరోజూ ధ్యానం చేయడం ద్వారా ఎక్కువ కాలం యవ్వనంగా ఉంటారని, ఆయుష్షు కూడా పెరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు.