New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Do-you-know-about-these-powerful-weapons-near-Lord-Shiva-jpg.webp)
Maha Shivratri 2025:
Maha Shivratri 2025: హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతీ సంవత్సరం పాల్గుణ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రోజున మాహాశివారాత్రి జరుపుకుంటారు. ఈ ఏడాది 26 బుధవారం నాడు మహాశివరాత్రి వచ్చింది. ఈ పర్వదినాన భోలేనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శివుడిపై భక్తి, శ్రద్దలతో ఉపవాసాలు, జాగారాలు పాటిస్తారు. మత విశ్వాసాల ప్రకారం మహాశివరాత్రి నాడు మహాదేవుడిని పూజించడం వల్ల వివాహంలో అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే శ్రేయస్సు, ఆనందం లభిస్తుంది. అయితే శివరాత్రి సందర్భంగా మహాదేవుని ప్రత్యేక ఆశీస్సులు పొందాలనుకుంటే, మీ రాశి ప్రకారం పేదలకు లేదా అవసరంలో ఉన్నవారికి ఈ దానాలు చేయండి.
మేష రాశి
- మేష రాశిలో జన్మించిన వారు మహాశివరాత్రి రోజున ఏదైనా వస్తువులను దానం చేయడం శుభ ఫలితాలను సూచిస్తుంది.
వృషభ రాశి
- వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు మహాశివరాత్రి రోజున బియ్యం, చక్కెరను దానం చేయడం ద్వారా శివుడి ఆశీస్సులు పొందుతారు.
మిథున రాశి
- మిథున రాశిలో జన్మించిన వారు శివరాత్రి రోజున ఆహారం లేదా డబ్బును దానం చేయవచ్చు.
కర్కాటక రాశి
- కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు మహాశివరాత్రి రోజున పండ్లు దానం చేయడం ద్వారా శుభం కలుగుతుంది.
సింహ రాశి
సింహ రాశి వారు మహాశివరాత్రి నాడు వస్త్రాలను దానం చేయవచ్చు.
కన్య రాశి
- కన్య రాశిలో జన్మించిన వ్యక్తులు మహా శివరాత్రి నాడు అవసరంలో ఉన్నవారికి డబ్బు దానం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు.
తులా రాశి
- తుల రాశిలో జన్మించిన వ్యక్తులు మహాశివరాత్రి నాడు ధాన్యాలను దానం చేయడం ద్వారా ఇంట్లో సుఖ శాంతులును పొందుతారు.
ధనుస్సు రాశి
- ధనుస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు మహాశివరాత్రి రోజున పేదలకు బట్టలు దానం చేయండి.
వృశ్చిక రాశి
- వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు మహా శివరాత్రి రోజున పేదలకు అన్నదానం చేయండి.
మకర రాశి
- మకర రాశిలో జన్మించిన వారు మహా శివరాత్రి నాడు బియ్యం దానం చేయండి.
కుంభ రాశి
- కుంభ రాశిలో జన్మించిన వ్యక్తులు మహాశివరాత్రి నాడు అవసరమైన వారికి డబ్బును దానం చేస్తే మంచి ఫలితాలను పొందుతారు.
మీన రాశి
- మీన రాశి వారు మహాశివరాత్రి నాడు బియ్యం, పప్పు, చక్కెర, సోంపు, వక్కలు దానం చేయండి.
తాజా కథనాలు