/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Do-you-know-about-these-powerful-weapons-near-Lord-Shiva-jpg.webp)
Maha Shivratri pooja Muhurat
Maha Shivratri 2025: హిందువులకు అతి ముఖ్యమైన పండుగలలో మహా శివరాత్రి ఒకటి. శివ భక్తులకు మరీ ప్రత్యేకమైనది. ప్రతీ ఏడాది మాఘమాసంలోని కృష్ణ పక్షం చతుర్దశి రోజున శివరాత్రి జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 26 బుధవారం రోజున మహాశివరాత్రి వచ్చింది. అయితే ఈ ఏడాది ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో చివరి రాజ స్నానం కూడా అదే రోజుతో ముగుస్తుండడంతో మహాశివరాత్రి మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. మహా కుంభమేళాతో పాటు ఈ సంవత్సరం మహాశివరాత్రి రోజున త్రిగ్రాహీ యోగం ఏర్పడనుంది. 149 ఏళ్ళ తరువాత సూర్యుడు, బుధుడు, శని కుంభరాశిలో కలిసి వస్తున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున భోలేనాథుడికి పూజలు, అభిషేకాలు చేయడం ద్వారా శుభఫలితాలు కలుగుతాయి. అలాగే ఉపవాసాలు, జాగారాలు పాటించడం ద్వారా శివకటాక్షం లభిస్తుందని నమ్ముతారు. అయితే మహాశివరాత్రి రోజున ఉపవాసం, పూజా కార్యక్రమాలకు సరైన సమయం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.. ఈ నాలుగు ముహూర్తాల్లో శివుడిని పూజించడం ద్వారా సంపద, కీర్తి, ప్రతిష్ట, శ్రేయస్సు పొందుతారు.
పూజకు సరైన ముహూర్తాలు
దృక్ పంచాంగ్ ప్రకారం, శివరాత్రి సమయంలో మీరు గుర్తుంచుకోవలసిన శుభ సమయాలు ఇక్కడ ఉన్నాయి:
- చతుర్దశి తిథి ప్రారంభం - ఫిబ్రవరి 26 ఉదయం 11:08
- చతుర్దశి తిథి ముగింపు - ఫిబ్రవరి 27 ఉదయం 8:54
- నిషిత కాల పూజ సమయం - 12:09 am నుంచి 12:59 am, ఫిబ్రవరి 27
నాలుగు ముహూర్తాలు
అయితే మొదటి ప్రహార్ పూజ సమయం: ఫిబ్రవరి 26న సాయంత్రం 6:29 నుండి రాత్రి 9:34 వరకు.
- రెండవ ప్రహార్ పూజ సమయం ఫిబ్రవరి 26న రాత్రి 9:34 నుంచి ఫిబ్రవరి 27న తెల్లవారుజామున 12:39 వరకు ఉంటుంది.
- మూడవ ప్రహార్ పూజ సమయం ఫిబ్రవరి 26 రాత్రి 12:39 నుండి 3:45 వరకు.
- నాల్గవ ప్రహార్ పూజ సమయం ఫిబ్రవరి 27న తెల్లవారుజామున 3:45 నుంచి 6:50 వరకు.
ప్రహార్ అంటే ఏంటి?
ప్రహర అనేది సంస్కృత పదం. రోజును ఎనిమిది భాగాలుగా భాగాలుగా విభజించడాన్ని ప్రహార్ అంటారు. నాలుగు ప్రహారాలు పగటి, నాలుగు రాత్రికి. రోజులోని మొదటి ప్రహారం సూర్యోదయంతో ప్రారంభమై, నాల్గవ ప్రహారం సూర్యాస్తమయంతో ముగుస్తుంది. అలాగే రాత్రి ప్రహారాలు సూర్యాస్తమయంతో మొదలై సూర్యోదయం మధ్య ముగుస్తాయి.