/rtv/media/media_files/2025/02/25/RBwuUnUfcivtamewzA5s.jpg)
Jyotirlinga Photograph: (Jyotirlinga )
Maha Shivaratri: దేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. వీటిని దర్శించుకుంటే పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతుంటారు. ఎందుకంటే ఈ 12 జ్యోతిర్లింగాలపై ప్రత్యేకంగా శివుని ఆశీస్సులు ఉంటాయట. అయితే 12 జ్యోతిర్లింగాలు ఏవేవి? ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని తెలుసుకుందాం.
Also Read: TS: నిర్మల్ కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీస్ స్వాధీనం..కోర్టు ఆదేశాలు
Also Read: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే
సోమనాథ జ్యోతిర్లింగం
గుజరాత్‌లోని సౌరాష్ట్రంలో సోమనాథ జ్యోతిర్లింగం ఉంది. దీన్ని మొదటి జ్యోతిర్లింగంగా గుర్తిస్తారు. ఇక్కడ శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు.
మల్లికార్జున జ్యోతిర్లింగం
ఏపీలోని శ్రీశైలం పర్వతంపై మల్లికార్జున జ్యోతిర్లింగం ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి ఎక్కువగా వెళ్తుంటారు. మహా శివరాత్రి నాడు ఈ ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు.
మహాకాలేశ్వర జ్యోతిర్లింగం
మూడవ జ్యోతిర్లింగమైన మహాకాలేశ్వరం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది. దక్షిణాభిముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగంగా మహాకాలేశ్వరం బాగా ప్రసిద్ధి పొందింది.
ఓంకారేశ్వర జ్యోతిర్లింగం
నర్మదా నది ఒడ్డున ఇండోర్ సమీపంలో ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఉంది.
భీమాశంకర జ్యోతిర్లింగం
మహారాష్ట్రలోని పూణేలో సహ్యాద్రి పర్వత శ్రేణులపై ఈ భీమాశంకర జ్యోతిర్లింగం ఉంది.
కేదార్‌నాథ్ జ్యోతిర్లింగం
ఉత్తరాఖండ్‌లో కేదార్ పర్వతంపై హిమాలయాల్లో కేదార్‌నాథ్ జ్యోతిర్లింగం ఉంది. దేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడికి ఏటా భక్తులు భారీ సంఖ్యలో వెళ్తుంటారు.
కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం పసిద్ధి చెందింది. ఇక్కడ శివుని ప్రత్యేకంగా పూజిస్తారు.
త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం ఉంది. ఈ ఆలయం ఎంతో విశిష్టమైనది.
వైద్యనాథ జ్యోతిర్లింగం
జార్ఖండ్‌లోని దేవఘర్లో వైద్యనాథ జ్యోతిర్లింగం ఉంది. ప్రధానమైన జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి.
నాగేశ్వర జ్యోతిర్లింగం
గుజరాత్‌లోని ద్వారకాపురి సమీపంలో నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంది. శివుడు స్వయంగా ఇక్కడ వెలిసాడని చెబుతుంటారు.
రామేశ్వర జ్యోతిర్లింగం
తమిళనాడులోని రామనాథంలో రామేశ్వర జ్యోతిర్లింగం ఉంది.
ఘృష్టేశ్వర జ్యోతిర్లింగం
మహారాష్ట్రలోని సంభాజీనగర్‌లో ఘృష్టేశ్వర జ్యోతిర్లింగం ఉంది. జ్యోతిర్లింగ్లాలో ఇదే చివరిది.
Also Read: CBSE: 2026 నుంచి రెండుసార్లు సీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు కోసం దీనికి సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.
Also Read: TG JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 50 వేల ఉద్యోగాలకు సీఎం గ్రీన్ సిగ్నల్!