/rtv/media/media_files/2025/02/23/MaIgeIKdcgCNWRBgvJjC.jpg)
SHIVA LINGAM
Mahashivratri 2025: హిందువులకు మహాశివరాత్రి అత్యంత ప్రీతికరమైన, శ్రేష్ఠమైన పర్వదినం. ఈ ప్రత్యేకమైన రోజున భోలే నాథుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం, జాగారాలు, పూజలు చేస్తారు భక్తులు. మాఘమాసంలోని కృష్ణ పక్షం చతుర్థశ తిథిని మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈ ఏడాది 26-02-2025 బుధవారం నాడు మహాశివరాత్రి వచ్చింది. అయితే కొన్ని దశాబ్దాలుగా ఏ ఆలయంలో చూసిన శివుడిని లింగరూపంలోనే పూజిస్తారు. ఫొటోలు తప్పా పరమశివుడి విగ్రహాలు ఎక్కడా కనిపించవు. అసలు శివుడిని లింగరూపంలోనే ఎందుకు పూజిస్తారు? దీని వెనుక ఉన్న కథేంటి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
లింగం వెనుక శాపం ?
వరాహపురాణం ప్రకారం.. ఒకరోజు భృగుమహర్షి పరమశివుడి దగ్గరకు వస్తాడు. అయితే ఆ సమయంలో శివుడు తాండవం చేస్తూ భృగుమహర్షిని పట్టించుకోడు. దీంతో కోపంతో రగిలిపోయిన మహర్షి శివుడిని శపిస్తాడు. ఇకపై భూలోకంలోని భక్తులు నిన్ను లింగాకారంలోనే కొలుస్తారు. నీ శివలింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు, నీ ప్రసాదం నింద్యం అవుతుంది అంటూ శివుడిని శపించి వెళ్ళిపోతాడు భృగుమహర్షి. అప్పటి నుంచి భక్తులు భోలేనాథుడిని లింగరూపంలో ఆరాధిస్తారు. శివలింగాన్నే శివుడి ప్రతిరూపంగా భావిస్తారు. శివం అంటే శుభప్రదమైనది, లింగం అంటే ఆకారం.. శివ లింగం అంటే శివుని ఆకారం అని అర్ధం.
Also Read: Kiccha Sudeep: హైదరాబాద్ మెట్రోలో హీరో కిచ్చా సుదీప్.. అక్కడ ఏం చేశారో చూడండి?
లింగాలు ఎన్ని రకాలు
- బాణ లింగం
- స్వయం భూ లింగం
- దైవిక లింగం
- రుష్య లింగం
- మానుష లింగం
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
Also Read: AR Rahman: నోరు తెరిస్తే ఏమౌతుందో తెలిసిందా.. యూట్యూబర్ అల్లాబాడియాకు రెహ్మాన్ చురకలు!