Turmeric: పురుషులు పసుపు తింటే ఇలా జరుగుతుందా!

పసుపు వినియోగం పురుషులకు ఎంతో ప్రయోజనకరమని సూచిస్తున్నారు నిపుణులు. పసుపు పురుషులలో లైంగిక సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిలోని పోషకాలు పురుషులు వీర్యకణాల నాణ్యతను పెంచుతాయట.

author-image
By Archana
New Update
turmeric benefits

turmeric benefits

Turmeric benefits: ఆయుర్వేదంలో పసుపుకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఆయుర్వేదంలో పసుపుకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్ గుణాలు అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా పురుషులు పసుపును తీసుకోవడం ద్వారా  అనేక లైంగిక సమస్యలను అధిగమించవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.. 

లైంగిక సమస్యలు

  • పసుపు పురుషులకు లైంగిక సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. వయసు పెరగడం, అలసట ఒత్తిడి కారణంగా పురుషుల్లో లిబిడో సెక్స్ డ్రైవ్ ) తగ్గే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పసుపు తీసుకోవడం ద్వారా లిబిడో (సెక్స్ డ్రైవ్)పెరుగుతుంది. 
  • చెడు జీవశైలి విధానాలు, అనారోగ్యపు ఆహరపు అలవాట్ల కారణంగా  ఈ రోజుల్లో  పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు చాలా వేగంగా తగ్గుతున్నాయి. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం..   పసుపు తీసుకోవడం ద్వారా టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. 

Also Read: Gandhi TathaChettu: థియేటర్స్ లో సుకుమార్ కూతురు అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్..!

  • పసుపు కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలసట, బలహీనత వంటి సమస్యలను తగ్గిస్తుంది.
  • పసుపులోని గుణాలు పురుషులు వీర్యకణాల నాణ్యతను పెంచుతాయని చెబుతారు. ఆయుర్వేదం ప్రకారం..  వీర్యం సన్నబడటం వల్ల ఇబ్బంది పడే వారు రొజూ ఉదయాన్నే పసుపు, తేనె మిశ్రమాన్ని సమాన మోతాదులో తీసుకోవడం వల్ల లైంగిక శక్తి కూడా పెరుగుతుంది.
  • పసుపులోని పోషకాలను శరీరానికి అందించడానికి ప్రతిరోజు కూరగాయాల్లో కలిపి తీసుకోవచ్చు. అలాగే  రాత్రి పడుకునే ముందు పసుపు పాలను తాగవచ్చు. 
  • పసుపులోని కుర్కుమిన్ వాపు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలను తగ్గిస్తుంది. పసుపుతో నల్ల మిరియాల  పొడిని కలిపి తీసుకోవడం వల్ల కూడా  చాలా ప్రయోజనం ఉంటుంది.

గమనిక: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు, సూచనల కోసం పండితులను సంప్రదించగలరు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భర్త మెచ్చిన అర్ధాంగిలో ఉండాల్సిన లక్షణాలివే!

భర్త మెచ్చిన అర్ధాంగి భాగస్వామితో గొడవలు పడదు. అలాగే కుటుంబ బాధ్యతలు తెలుసుకుని, ప్రేమగా చూసుకుంటూ.. నిజాయితీగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్న భార్యలను భర్తలు ఎక్కువగా ఇష్టపడతారని నిపుణులు అంటున్నారు.

New Update
Marriage

Marriage

ఈ మధ్య కాలంలో పెళ్లి అంటే యువత భయపడుతుంది. అందులోనూ అబ్బాయిలు అయితే పెళ్లి చేసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. దీనికి ముఖ్య కారణం.. మంచి అర్థాంగి దొరకకపోవడమే. అయితే భర్త మెచ్చిన అర్థాంగి అంటే ఎలా ఉండాలి? అలాంటి అమ్మాయిలో ఉండాల్సిన లక్షణాలు ఏవో తెలియాలంటే స్టోరీ మొత్తం మీరు చదవాల్సిందే. 

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

గొడవలు పడదు

మంచి భార్య భర్తతో ఎప్పుడూ గొడవలు పడదు. భర్తను అన్ని విధాలుగా కూడా అర్థం చేసుకుంటుంది. చిన్న విషయానికి కూడా భార్యలు గొడవలు పడితే.. వారికి గౌరవం తగ్గిపోతుంది. భర్తను ఎప్పుడు గౌరవిస్తూ.. ప్రేమగా చూసుకుంటూ.. అర్థం చేసుకునేది భార్య మంచిదట.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

నిజాయితీ
ఏ బంధంలో అయినా కూడా నిజాయితీ ఉండాలి. భర్తను నమ్మడంతో పాటు తనని మోసం చేయకుండా నిజాయితీగా ఉండాలి. దీనివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు కూడా రావు. అలాగే భర్త సమ్మతితో పని చేసే భార్యను భర్తలు మంచి భార్యలుగా భావిస్తారు.

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

బాధ్యతలు
భార్య అందంగా లేకపోయినా పర్లేదు.. కానీ బాధ్యతగా అయితే మాత్రం ఉండాలి. నా కుటుంబం, నా అత్తమామ, నా భర్త అని బాధ్యతగా తీసుకుని కుటుంబ సభ్యులను చూసుకోవాలి. అత్తవారింటిని కన్నవారి ఇంటిలా చూసుకునే భార్య మంచి అర్థాంగి. 
 
ప్రేమ
అందరికంటే తన భర్త మీదే ప్రేమ ఎక్కువగా ఉండాలి. తన భర్త మీద మాట పడకుండా చూసుకునే అమ్మాయి మంచిగా భార్యగా ఉంటుంది. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
Advertisment
Advertisment