/rtv/media/media_files/2025/03/15/w3UeClnqZiJTTpuATaDx.jpg)
illegal relationship reasons
Life Style: ఈ మధ్య అక్రమ సంబంధాల కారణంగా ప్రాణాలు తీసుకున్న అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పెళ్ళైన పురుషులు, లేదా మహిళలు ఇతరులతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం.. తీరా అవి బయటపడేసరికి అవమానం తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం చేస్తున్నారు. మరికొంతమంది అక్రమసంబంధాల కోసం కట్టుకున్న భార్యను, పిల్లలను కూడా కడతేర్చే స్థాయికి వెళ్తున్నారు. అయితే తాజా సర్వేల్లో వివాహేతర సంబంధాల గురించి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. అసలు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి గల కారణమేంటి? ఎంత శాతం మంది తమ భాగస్వాములను మోసం చేస్తున్నారు? వంటి అంశాలు ఈ సర్వేలో పేర్కొన్నారు.
అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయంలోని నేషనల్ ఒపీనియన్ రీసెర్చ్ సెంటర్ 2022లో నిర్వహించిన గ్లోబల్ సోషల్ సర్వే (GSS)లో దీనికి సంబంధించిన విషయాలను బయటపెట్టింది. ఈ సర్వేలో, 20 శాతం మంది పురుషులు, 13 శాతం మంది మహిళలు తమ జీవిత భాగస్వాములను మోసం చేసినట్లు అంగీకరించారు. అంతేకాదు బ్రిటిష్ పరిశోధన, డేటా విశ్లేషణ సంస్థ 2019 లో 1000 కంటే ఎక్కువ మంది వివాహితలపై నిర్వహించిన సర్వేలో కూడా ఇలాంటి ఫలితాలే కనుగొనబడ్డాయి.
వీరిలో 20 శాతం మంది పురుషులు, 10 శాతం మంది మహిళలు తమ జీవిత భాగస్వాములను మోసం చేసినట్లు అంగీకరించారు. అయితే గత కొన్ని దశాబ్దాలుగా, వివాహేతర సంబంధం పెట్టుకునే స్త్రీల సంఖ్య క్రమంగా పెరిగింది. 2010లో జరిపిన సర్వేలో భార్యలు తమ భర్తలను మోసం చేసే ధోరణి 20 సంవత్సరాల క్రితం కంటే 40 శాతం ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.
వివాహేతర సంబంధాలకు గల కారణాలు
ఒంటరితనం
సాధారణంగా స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ భావోద్వేగానికి గురవుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో భాగస్వామి దగ్గరగా లేకపోవడం వారిని ఒంటరితనానికి గురిచేస్తుంది. ఇది వారిలో విభిన్న ఆలోచలనకు దారితీసే అవకాశం ఉంది. చాలా మంది వర్క్ లేదా ఫ్యామిలీ టెన్షన్స్ లో బిజీగా ఉండిపోయి పార్ట్నర్ కి సమయం కేటాయించలేకపోతారు. కానీ అలా చేయడం వల్ల బంధం బలహీనపడుతుంది.
తక్కువ ఆత్మగౌరవం
స్త్రీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, అటెన్షన్ ఇవ్వకపోవడం కూడా ఇలాంటి సంబంధాలకు దారితీస్తుంది. ఈ పరిస్థితులు ఆమెకు కావాల్సిన శ్రద్ధ, గౌరవం మొదలైన వాటి కోసం బయటి వ్యక్తుల వైపు చూసేలా చేస్తుంది.
కోరికలు
అధ్యయనాలు తమ భాగస్వాములను మోసం చేసే మహిళలు తమ భావోద్వేగ అవసరాలను తీర్చుకోవడానికి అలా చేస్తారని చూపిస్తున్నాయి. ఇందులో సెక్స్ కూడా ఒకటి. స్త్రీ తన ప్రస్తుత సంబంధం నుంచి పొందలేని సంభాషణ, సానుభూతి, గౌరవం, ప్రశంస, మద్దతును ఎదుటి వ్యక్తి నుంచి కోరుకుంటుంది.
కోపం
కొంతమంది మహిళలు తమ భాగస్వామిని ఒకలా ఊహించుకొని వివాహ బంధంలోకి సంబంధంలోకి ప్రవేశిస్తారు. కానీ భాగస్వామి అంచనాలకు తగ్గట్లుగా లేనప్పుడు సంబంధంలో చీలిక మొదలవుతుంది. ఇది కాకుండా, కొంతమంది తమ పాస్ట్ రిలేషన్ షిప్స్ కారణాల వల్ల కూడా భాగస్వామిని మోసం చేస్తుంటారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!