/rtv/media/media_files/2025/03/05/6NAW56KjwYTDdHTfD5DA.jpg)
healthy juices for kids
Life Style: ఎదిగే వయసులో పిల్లల మంచి ఎత్తు,పెరుగుదల కోసం సరైన ఆహరం ఇవ్వాలి. చాలా మంది పిల్లలు సరైన పౌష్టికాహారం లేక ఎత్తు చిన్న వయసులోనే ఆగిపోవడం జరుగుతుంది. అయితే పిల్లల ఆహరంలో కొన్ని జ్యూస్ లను చేర్చడం ద్వారా వారికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. ఇవి పిల్లల శారీరక అభివృద్ధికి సహాయ పడతాయి. అలాగే ఎత్తు కూడా పెరుగుతారు.
పాలకూర జ్యూస్
పిల్లలకు క్రమం తప్పకుండా పాలకూర రసం ఇవ్వడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో ఇనుము లోపం తొలగిపోతుంది. శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం కూడా బలోపేతం చేస్తుంది. కంటి చూపును మెరుగుపారుస్తుంది. పాలకూర రసం పెరుగుతున్న పిల్లల ఎత్తును పెంచడంలో సహాయపడుతుంది.
నారింజ జ్యూస్
నారింజ జ్యూస్ పిల్లల ఎత్తు పెరగడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. నారింజ పండ్లలో విటమిన్ సి, కాల్షియం, ఫైబర్, ఐరన్, ఫాస్పరస్, కెరోటిన్ వంటి ముఖ్యమైన పోషకాలు తగిన మొత్తంలో ఉంటాయి. దీన్ని తాగడం వల్ల శరీర రోగనిరోధక శక్తి బలపడుతుంది, ఎముకలు బలపడతాయి.
బనానా షేక్
అరటి పండులో విటమిన్లు, కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. ఇది పిల్లల శారీరక అభివృద్ధికి వేగంగా సహాయపడుతుంది. .
క్యారెట్ జ్యూస్
క్యారెట్లలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ కె,ఫాస్ఫరస్ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. క్యారెట్లు తినడం ద్వారా దానిలోని విటమిన్ ఎ ను శరీరం బీటా కెరోటిన్‌గా మారుస్తుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది అలాగే శరీర పెరుగుదలకు సహాయపడుతుంది. పెరుగుతున్న పిల్లల ఎత్తు పెంచడానికి, క్యారెట్ జ్యూస్ ఇవ్వడం ఆయుర్వేదంలో చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
జామకాయ జ్యూస్
పెరుగుతున్న పిల్లలో మంచి ఎత్తు, పెరుగుదల కోసం జామకాయ జ్యూస్ కూడా మంచి ఎంపికగా పరిగణించబడుతుంది. జామకాయలో విటమిన్ సి, కాల్షియం, ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి6, విటమిన్ బి12 , మెగ్నీషియం పిల్లల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అలాగే పిల్లల్లో కడుపు సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి. పిల్లల శారీరక అభివృద్ధికి సహాయపడుతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.