Life Style: ప్లాంక్ చేస్తే నిజంగానే ఏదైనా ప్రయోజనం ఉంటుందా ? మీరే చూడండి

ప్లాంక్ వ్యాయామం చేయడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో ప్రధాన కండరాళ్ళను బలోపేతం చేస్తుంది. నడుము, వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే శరీర భంగిమను మెరుగుపరుస్తుంది

New Update
plank health benefits

plank health benefits

Life Style: వ్యాయామాలలో అనేక రకాలు ఉంటాయి. వాటిలో ఒకటి ప్లాంక్. ప్లాంక్ అనేది స్ట్రెంగ్త్, బాడీ స్టెబిలిటీకి సంబంధించిన వ్యాయామం. ఇది శరీరంలో ప్రధాన కండరాళ్ళను బలోపేతం చేయడంతో పాటు శరీరాన్నీ కూడా  బలపరుస్తుంది. క్రమం తప్పకుండా ప్లాంక్ చేయడం వల్ల శారీరక,  మానసిక ఆరోగ్యానికి  అనేక ప్రయోజనాలు ఉంటాయి. ప్లాంక్ ఎలా చేయాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటి అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.. 

ప్లాంక్ ఎలా చేయాలి?

ముందుగా, నేలపై కాళ్ళను, చేతులను ఆనించి పొట్ట భూమికి తగలకుండా  పడుకోండి. ఆ తర్వాత మోచేతులను భుజాల కింద ఉంచి, చేతులను 90 డిగ్రీల కోణంలో ఉంచండి. ఇప్పుడు రెండు పాదాల వేళ్లపై నిలబడి మీ శరీరాన్ని పూర్తిగా నిటారుగా ఉంచండి. తల నుంచి కాలి వరకు భాగం ఒకే రేఖలో ఉండేలా శరీరాన్ని స్ట్రైట్ గా  ఉంచడానికి ప్రయత్నించండి. మీ నడుము,  తుంటిని వంగనివ్వకండి. తల పైకి  లేపనివ్వకండి. 

ప్రయోజనాలు

  • భుజాలు, మణికట్లు బలంగా 

ప్లాంక్ చేయడం వల్ల భుజాలు, మణికట్టు,  చేతుల కండరాలు కూడా బలపడతాయి. ఇది ముఖ్యంగా బరువులు ఎత్తడం లేదా చేతులు ఉపయోగించడం వంటి వ్యాయామాలు చేసే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

  • నడుము,  వెన్నునొప్పి నుంచి ఉపశమనం

వెన్నునొప్పి , కూర్చోవడానికి లేదా  నిలబడటానికి ఇబ్బంది ఉన్నవారు ప్లాంక్ వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయండి. దీని వల్ల వల్ల నడుము దిగువ భాగం బలపడుతుంది.  నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. 

  • కండరాలను బలపరుస్తుంది

ప్లాంక్ ప్రధానంగా  (ఉదర, వీపు,  నడుము కండరాలు) కండరాలను బలపరుస్తుంది. ఇది శరీరం మధ్య భాగాన్ని బలోపేతం చేయడమే కాకుండా అక్కడ రక్త ప్రసరణను పెంచుతుంది. క్రమం తప్పకుండా ప్లాంక్ చేయడం వల్ల యాప్స్ (కడుపు కండరాలు),  నడుము కండరాలు బలపడతాయి.

  • భంగిమను మెరుగుపరుస్తుంది

ప్లాంక్ వ్యాయామం చేయడం నిలబడి లేదా కూర్చున్నప్పుడు సరైన భంగిమను నిర్వహించడంలో సహాయపడుతుంది. కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు కూర్చునే వ్యక్తులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.  

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఇంట్లోనే ఎండు ద్రాక్షను తయారు చేసుకోవడం ఎలాగంటే?

ఒక పాత్రలో నీళ్లు తీసుకుని మరిగించాలి. ఇందులో కేజీ ద్రాక్ష పండ్లను వేసి ఉబ్బినంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత వడబోసి కాటన్ క్లాత్‌లో వేసి ఎండలో ఆరబెట్టాలి. ఇలా నాలుగు రోజుల పాటు ఆరబెడితే హోమ్ మేడ్ కిస్‌మిస్ రెడీ.

New Update
raisins making

raisins making Photograph: (raisins making)

కిస్‌మిస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి. అయితే వీటిని స్వీట్లు, తీపి పదార్థాలు ఇలా ప్రతీ దాంట్లో కూడా వేస్తారు. మరికొందరు వీటిని నానబెట్టి పరగడుపున తింటారు. అయితే మార్కెట్‌లో దొరికే కిస్‌మిస్‌లో కల్తీ ఉంటుంది. వీటివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎలాంటి కల్తీ లేకుండా సహజంగా ఇంట్లోనే కిస్‌మిస్‌ను ఈజీగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఈ స్టోరీలో చూద్దాం.

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

ద్రాక్ష పండ్లు మునిగేంత వరకు..

కిస్‌మిస్‌ను తయారు చేయడానికి కేజీ ద్రాక్ష, నీరు ఉంటే సరిపోతుంది. ఒక వెడల్పు ఉన్న గిన్నెలో ద్రాక్ష పండ్లు వేసి, మునిగేంత వరకు నీళ్లు, ఉప్పు వేసి ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత వాటిని శుభ్రం చేసి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి సగానికి పైగా నీళ్లు వేయాలి. నీరు మరుగుతున్నప్పుడు శుభ్రం చేసుకున్న ద్రాక్ష వేసుకుని ఓ 5 నిమిషాల పాటు ఉడికించాలి. 

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

అవి కాస్త ఉబ్బిన వెంటనే స్టవ్​ ఆఫ్​ చేసి వెంటనే వడకట్టాలి. వీటిని కాటన్ క్లాత్‌లో వేసుకుని ఎండలో ఉంచాలి. రెండు లేదా ఆరు రోజుల వరకు ఎండలో ఉంచితే అవి ఎండుతాయి. వీటిపై ఎలాంటి దుమ్ము, ధూళీ పడకుండా ఉండటానికి పల్చటి క్లాత్ కప్పాలి. ​అంతే ఇక కిస్‌మిస్ రెడీ అయినట్లే.

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment