/rtv/media/media_files/2025/02/19/61qhMftcvUuOIpkLGJ9T.jpg)
milk boiling tips
Life Style: పాలలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. ఇవి ప్రతి ఒక్కరి ఆహారంలో చాలా ముఖ్యమైన భాగం. పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉండడంతో దీనిని 'సంపూర్ణ ఆహారం' అని పిలుస్తారు. అయితే సాధారణంగా అందరికీ పాలను మరిగించి తాగడం అలవాటు. తద్వారా అందులో ఉండే బ్యాక్టీరియా నశించి ఎలాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉండదని నమ్ముతారు. అయితే పాలు మరిగించేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. లేదంటే పాలు విరిగిపోవడం, పాలలోని పోషకాలు నశించడం జరుగుతుంది. రోజు పాలు మరిగించేటప్పుడు ఏ తప్పులు చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం
హై-ప్లేమ్ మీద మరిగించడం..
పాలు త్వరగా మరగాలని చాలా మంది పాలను హై-ప్లేమ్ మీద మరిగిస్తారు. అయితే పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పద్ధతి సరైనది కాదు. హై ఫ్లేమ్ పై మరిగించడం ద్వారా పాలలోని సహజ చక్కర కరిగిపోతుంది. అలాగే ప్రోటీన్లు కూడా ఒకే చోట పేరుకుపోతాయి. పాలను మీడియం ఫ్లేమ్ పై మరిగించాలి. మరిగేటప్పుడు దానిలోని కొవ్వు, నీరు, కార్బోహైడ్రేట్లు కలిసి ఉండేలా కదిలిస్తూ ఉండాలి.
Also Read: Rishab Shetty: ఫ్యాన్స్ కి గూస్ బంప్స్.. ఛత్రపతి శివాజీ మహారాజ్ గా రిషబ్ శెట్టి.. పోస్టర్ వైరల్
పదే పదే మరిగించడం..
పాలలో పోషక విలువలను కాపాడుకోవడానికి పదే పదే మరిగించకూడదు. చాలా మంది తాగిన ప్రతీసారి వేడి చేయడం చేస్తుంటారు. అలా అస్సలు చేయకూడదు. ఒకసారి మరిగించి పెడితే సరిపోతుంది. పదే పదే మరిగించడం వల్ల దానిలోని పోషకాలు నాశనమవుతాయి. తద్వారా పాలలోని పూర్తి ప్రయోజనాలు శరీరానికి అందవని అనేక పరిశోధనలలో వెల్లడైంది. తాగే ముందు ఎక్కువగా కాకుండా కొద్దిగా వేడి చేయడానికి ప్రయత్నించండి.
ఎక్కువసేపు మరిగించడం..
అయితే కొంతమంది మహిళలు పాలను తక్కువ మంట మీద ఎక్కువసేపు మరిగించడం చేస్తుంటారు. పాలను చిక్కగా చేసి మందపాటి మీగడను పొందడానికి చేస్తారు. ఇలా చేయడం కూడా అస్సలు సరైనది కాదట. నిపుణుల అభిప్రాయం ప్రకారం, తక్కువ మంట మీద పాలను ఎక్కువసేపు మరిగించడం వల్ల దాని పోషకాలు తగ్గిపోతాయి. పాల పూర్తి ప్రయోజనాలను పొందలేరు. పాలను ఎల్లప్పుడూ మీడియం మంట మీద మరిగించాలి. అప్పుడప్పుడు చెంచాతో కలుపుతూ ఉండాలి.
Also Read: Lavanya: ఓవైపు రాజ్ ని ప్రేమిస్తూనే మస్తాన్ సాయితో బెడ్ రూమ్ లో.. లావణ్య గురించి ఫ్రెండ్ ప్రీతీ..