/rtv/media/media_files/2025/02/25/smhgSEiIQOJW7wx4BhdL.jpg)
fruits to avoid in night
Life Style: సాధారణంగా పండ్లలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. డైలీ డైట్ లో పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయినప్పటికీ సరైన సమయంలో తీసుకుంటేనే ఆరోగ్యం. కొన్ని పండ్లను రాత్రిపూట తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యాధులు, చక్కర స్థాయిలు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. రాత్రి సమయంలో తీసుకోకూడని పండ్లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
నారింజ
నారింజలో విటమిన్ సి మరియు అనేక పోషకాలు అధికంగా ఉంటాయి. కానీ పొరపాటున కూడా రాత్రిపూట ఈ పండును తినకూడదు. రాత్రి సమయాల్లో దీనిని తినడం ద్వారా నిద్రకు భంగం కలుగుతుంది. అలాగే కడుపు నొప్పి లేదా ఉబ్బరం వంటి సమస్యలు కూడా వస్తాయి.
అరటిపండు
అరటిపండులో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. అయితే, రాత్రిపూట మాత్రం దీనిని తినడం మానుకోవాలి. అరటిపండ్లలో అధిక మొత్తంలో కేలరీలు ఉంటాయి. దీంతో రాత్రిపూట అరటిపండ్లు తిని నిద్రపోవడం ద్వారా బరువు పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాదు అరటిపండు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. జీర్ణక్రియకు కూడా ఇబ్బంది అవుతుంది.
ఆపిల్
ప్రతిరోజూ డైట్ లో ఒక ఆపిల్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అయితే పూర్తి ప్రయోజనాల కోసం పగటి పూట మాత్రమే తీసుకోవడం మంచిది. రాత్రిపూట ఆపిల్ తినడం ఆరోగ్యానికి హానికరం. దీని కారణంగా అసిడిటీ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే నిద్రకు భంగం కలుగుతుంది.
సపోటా
సపోటా మంచి రుచితో పాటు, పుష్కలమైన పోషకాలతో నిండి ఉంటుంది. శరీర అలసటను తొలగించడమే కాకుండా, కళ్ళకు కూడా సపోటా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే, రాత్రిపూట సపోటా తినడం ఆరోగ్యకరం కాదు. దీనిలో చక్కర స్థాయిలు అధికంగా ఉంటాయి.
తద్వారా రక్తంలో చక్కర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంది.
జామ పండు
రాత్రిపూట జామపండు తినడం కూడా మానుకోవాలి. జామపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కానీ రాత్రిపూట జామపండు తింటే జీర్ణం కావడం కష్టం అవుతుంది. ముఖ్యంగా జీర్ణక్రియ సరిగా లేని వారు పొరపాటున కూడా రాత్రిపూట జామపండు తినకూడదు. అయితే దీనిని పగటిపూట తీసుకుంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.