/rtv/media/media_files/2024/12/22/8CxDgCctMqUT8U9JvIN9.jpg)
భారతీయ భోజనంలో పెరుగు అనేది చాలా ముఖ్యమైన అంశం. భోజనంలో ఎన్ని రకాల కూరగాయలు ఉన్నప్పటికీ చివరిగా పెరుగుతో తింటేనే సంతృప్తి. అంతేకాదు పెరుగుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
/rtv/media/media_files/2024/12/18/coconutcurd9.jpeg)
పెరుగు తినడం ద్వారా జీర్ణకోశ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మధుమేహం ముప్పులు కూడా తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
/rtv/media/media_files/2024/12/22/8CxDgCctMqUT8U9JvIN9.jpg)
అయితే తాజాగా పెరుగు తినడం వల్ల మరో ప్రయోజనం గురించి బయటపడింది. వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల పెరుగు తినేవారికి పెద్ద పేగు క్యాన్సర్ ముప్పు తగ్గుతున్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది. ముఖ్యంగా కుడి వైపు వచ్చే క్యాన్సర్ కి మరింత మేలట.
/rtv/media/media_files/2025/01/05/85O83G3wOI14xHS3dUeh.jpg)
పెద్ద పేగులో ఎడమ వైపున వచ్చే క్యాన్సర్ కంటే కుడి వైపు క్యాన్సర్ తీవ్రమైనదిగా ఉంటుంది. పెరుగులో బ్యాక్టీరీయా పేగులోని బ్యాక్టీరియాను సమతుల్యం చేయడం ద్వారా క్యాన్సర్ ముప్పు తగ్గడానికి తోడ్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
/rtv/media/media_files/2024/12/28/dWogXh6z2OB9gTd5cVSw.jpg)
ఆహారం, పేగు బ్యాక్టీరియా, పెద్దపేగు క్యాన్సర్ మధ్య ఉన్న సంబంధాన్ని ఈ అధ్యయనం మరోసారి నిరూపించింది.
/rtv/media/media_files/2024/11/21/cancer-patient2.jpeg)
ప్రస్తతం దేశంలో క్యాన్సర్ కేసులు సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ఇలా రకరకాల క్యాన్సర్ బారిన పడుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Cancer-2-scaled.jpg)
క్యాన్సర్ నివారణకు సంబంధించిన చికిత్స పై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
/rtv/media/media_files/2024/11/11/cancer3.jpeg)
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు కోసం దీనికి సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.