Life Style: నీలిపండ్లతో నిగనిగలాడే చర్మం.. ఎలాగో తెలుసా?

బ్లూబెర్రీస్‌ చర్మ సౌందర్యానికి చాలా ముఖ్యమైనవి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి  సహాయపడతాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా తోడ్పడతాయి. 

New Update
blue berries

blue berries

Life Style: బ్లూబెర్రీస్‌లో  పుష్కలమైన పోషకాలు ఉంటాయి. ఈ పండును తక్కువ పరిమాణంలో తిన్నప్పటికీ, మీరు అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా వీటిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మ సౌందర్యానికి అత్యంత ముఖ్యమైనవిగా వ్యవహరిస్తాయి.  ఇవి కణాలను దెబ్బతీసే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి  సహాయపడతాయి.  ఫ్రీ రాడికల్స్‌ వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తాయి. అలాగే గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.

Also Read: Pellikani Prasad: హైప్ అదిరింది.. ప్రభాస్ తో 'పెళ్లికాని ప్రసాద్' టీజర్.. రిలీజ్ ఎప్పుడంటే

చర్మ సౌందర్యం 

అయితే  వయసు పెరిగే కొద్దీ శరీరానికి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే సామర్థ్యం తగ్గుతుంది. ఇది మీ కణాలపై, ముఖ్యంగా  చర్మ కణాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్లూ బెర్రీస్ తీసుకోవడం ద్వారా   చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ధాప్య ఛాయలను తొలగిస్తాయి. 

కొల్లాజెన్‌

బ్లూబెర్రీస్‌లో ఆంథోసైనిన్‌లు పుష్కలంగా ఉంటాయి.  ఇవి కొల్లాజెన్ ఉత్పత్తకి  సహాయపడతాయి. కొల్లాజెన్  శరీరాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచడంలో తోడ్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు కొన్ని  అధ్యనాల్లో  బ్లూబెర్రీస్ అధికంగా ఉన్న ఆహారం ఇచ్చినప్పుడు ఎముకలలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగినట్లు తేలింది. అందువల్ల, దీని వినియోగం  ప్రయోజనకరంగా ఉంటుంది. 

Also read :  Mika Singh: అందుకే వాళ్లకు ఆ గతి పట్టింది.. బిపాసా దంపతులపై ప్రముఖ సింగర్ షాకింగ్ కామెంట్స్!

గుండె ఆరోగ్యానికి 

బ్లూబెర్రీస్‌లోని పోషకాలు  పోషకాలు గుండె ఆరోగ్యాన్ని కూడా  మెరుగుపరుస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం, వీటోలోని 'anthocyanins'  మెరుగైన రక్త ప్రసరణకు  తోడ్పడతాయి. సరైన రక్తప్రసరణ కారణంగా గుండె శరీరానికి ఆక్సిజన్, ఇతర పోషకాలను ఎటువంటి సమస్య లేకుండా అందిస్తుంది. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also read :  Viral video: పక్కన ఇద్దరుండగానే మూడో వాడికి ముద్దులు.. మద్యం మత్తులో యువతి హల్ చల్!

Advertisment
Advertisment
Advertisment