Leather Watch: వాచ్ బెల్ట్ ను ఎలా తయారు చేస్తారో తెలుసా?

మార్కెట్లో రకరకాల కంపెనీల వాచ్‌లు ఉంటాయి. వాటిల్లో కొందరు లెదర్ బెల్ట్ కలిగిన వాచ్‌లను ఇష్టపడతారు. ఫుల్‌గ్రెయిన్, కాఫ్‌స్కిన్, ఎలిగేటర్, స్వెడ్ లెదర్ వంటివి జంతువుల చర్మంతో చేస్తారు. పైనాపిల్ లెదర్ చాలా ఫేమస్‌.

New Update
Leather Watch

Leather Watch: ప్రస్తుత కాలంలో ఫ్యాషన్ వస్తువులకు ఎంతో డిమాండ్ ఉంది. చిన్నల నుంచి పెద్దల వరకు ఏ కొత్త ఫ్యాషన్ బట్టలు, వస్తువులు వచ్చినా కచ్చితంగా వాటిని ఇష్టపడతారు. అంతేకాదు.. ఎంత ఖరీదైన కొనుక్కోవడానికి వెనకడుగు వేయరు ఈ కాలం జనరేషన్ మనుషులు. అయితే మనం ఎంత ఖరీదైన ఫ్యాషన్ వస్తువులు ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నా వాటి విలువలు మాత్రం చాలామందికి తెలవదు. అవి ఎలా వచ్చాయి..? వాటివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి..? అసలు పెట్టుకోవచ్చా..? లేదా..? అనే విషయాలను కూడా కొందరు పట్టించుకోరు. అలాంటి వాటిలో వాచ్‌ ఒకటి. వాచ్‌ అనేది ప్రతి మనిషి జీవితంలో ఉపయోగపడే ఒక వస్తువు. వాటిల్లో కొందరు బ్రాండ్‌ని ఇష్టపడితే.. మరికొందరు లెదర్ బ్రాండ్ ఉన్న వాచ్‌లను ఇష్టపడతారు. అయితే ఈ లెదర్ బ్రాండ్ వాచ్‌లు వివిధ రకాలుగా ఉంటాయి. అన్ని ఒకేలా ఉన్నా కానీ వాటి మధ్య తేడాలుంటాయి. లెదర్ వాచ్‌లు ఎక్కువగా జంతువుల చర్మాలతో తయారు చేస్తారట. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

లెదర్ వాచ్‌లు తయారు చేసే విధానం:

ఫుల్ గ్రెయిన్ లెదర్: ఇది కంగారు ఆవు చర్మంతో తయారు చేస్తారు. దీనిని ఈ జంతుల వెంట్రుకల క్రింద చర్మంతో తయారు చేస్తారు. అయితే ఇవి మన్నికగా, బలంగా ఉంటాయి. ప్రాసెసింగ్ చేసే టైంలో జుట్టు తీసివేసి తోలు నుంచి చేస్తారు. ఈ తోటు చెమట, తేమను నిరోధిస్తుందట.

కాఫ్ స్కిన్ లెదర్: ఈ రకమైన తోలుకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఇది దూడ చర్మంతో తయారు చేస్తారు. దీనితో చేసే వాచ్‌లు మృదువైన, చక్కటి ఆకృతి ఉంటుంది. అందుకే ఇదీతో చేసిన వాచ్‌లు చేతికి పెట్టుకున్న హాయిగా ఉంటాయి. దీని నాణ్యత వల్ల ధర ఎక్కువగా ఉంటుంది.

ఎలిగేటర్ లెదర్: ఇది మొసలి చర్మంతో తయారు చేస్తారు. అంతేకాదు జంతువుల తోలు కంటే మొసలి చర్మం పటిష్టంగా ఉంటుంది. బ్రాండ్‌ లేదర్‌ వాచ్‌లతో పాటు వివిధ రకాలైన ఫ్యాష్యన్‌ వస్తువులను తయారు చేస్తారు.

స్వెడ్ లెదర్: ఇది గొర్రె చర్మంతో తయారు. ఈ తోలు చాలా మృదువు ఉంటుంది. ఇది మేక, పంది, దూడ, జింకల జంతు చర్మాల దిగువ నుంచి తీసిన ప్రత్యేక రకం తోలు కూడా లెదర్‌కి ఉపయోగిస్తారు. దీనిని మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువ.

పైనాపిల్ లెదర్: పైనాపిల్ లెదర్ చాలా ఫేమస్‌. ఈ ప్రత్యేకమైన తోలును పైనాపిల్ మొక్క ఆకుల నుంచి తయారు చేస్తారు. పైనాపిల్ పైనాపిల్ ఆకుల్లో తోలు లాంటి పదార్థమై పినాటెక్స్ అనే ప్రత్యేక ఫైబర్ ఉంటుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vaishakha Amavasya వైశాఖ అమావాస్య రోజున.. ఈ రాశుల వారు ఇవి దానం చేస్తే అన్నీ శుభాలే !

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 27న వైశాఖ అమావాస్య వస్తుంది. ఈరోజు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అయితే వైశాఖ అమావాస్య రోజున రాశిచక్రం ప్రకారం కొన్ని చర్యలు  చేయడం ద్వారా  శుభ ఫలితాలను కలిగిస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.. 

New Update
Vaishakha Amavasya

Vaishakha Amavasya

Vaishakha Amavasya హిందూ మతవిశ్వాసాల ప్రకారం వైశాఖ అమావాస్య ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఏడాదిలో 12 అమావాస్య తిథులు ఉంటాయి. అందులో వైశాఖ మాసంలో వచ్చే అమావాస్యను వైశాఖ అమావాస్య అంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 27 ఉదయం 4: 28 గంటలకు మొదలై 28 తెల్లవారుజామున 1: 02 గంటలకు ముగుస్తుంది. ఈ ప్రత్యేకమైన రోజున విష్ణువును పూజిస్తారు. అలాగే దానధర్మాలకు కూడా ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. పితృదేవులకు పిండం, తర్పణం కూడా చేస్తారు. అయితే పితృదేవుల ఆత్మశాంతి కోసం  వైశాఖ అమావాస్య రోజున రాశిచక్రం ప్రకారం కొన్ని చర్యలు  చేయడం ద్వారా  శుభ ఫలితాలను కలిగిస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.. 

రాశి చక్రం ప్రకారం చేయాల్సిన పనులు 

మేష రాశి 

 మేష రాశి వారు వైశాఖ అమావాస్య రోజున  తమ పూర్వీకులకు నీరు, షర్బత్, చల్లని వస్తువులను దానం చేయడం శుభ ఫలితాలను కలిగిస్తుంది. 

వృషభ రాశి 

వైశాఖ అమావాస్య రోజున వృషభ రాశి వారు డబ్బు, ఆహారాన్ని దానం చేయడం ద్వారా తమ పూర్వీకులను ప్రసన్నం చేసుకుంటారు. అలాగే శుభఘడియలు కూడా మొదలవుతాయి. 

కర్కాటక రాశి 

ఈ ప్రత్యేకమైన రోజున కర్కాటక రాశి వారు తెల్లటి ఆహార పదార్థాలను, ధనాన్ని ఎక్కువగా దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శుభఫలితాలు కలగడంతో పాటు పూర్వీకుల ఆత్మ శాంతిస్తుంది. 

సింహరాశి 

సింహ రాశివారు బెల్లం, పప్పుదినుస్సులు, తేనే దానం చేయవచ్చు. వైశాఖ అమావాస్య రోజున ఈ దానాలు సింహరాశి వారికి శుభప్రదంగా పరిగణించబడతాయి. 

కన్య రాశి 

వైశాఖ అమావాస్య రోజున కన్య రాశి వారు పూర్వీకుల ఆనందం కోసం నెయ్యితో తయారు చేసిన ఆహార పదార్థాలను దానం చేయాలి. 

తులారాశి 

తులారాశిలో జన్మించినవారు బ్రాహ్మణులకు భోజనం పెట్టడం, తెల్లటి వస్త్రాలను దానం చేయడం ద్వారా శుభాలు చేకూరుతాయి. 

వృచ్చిక రాశి 

వృచ్చిక రాశివారు బెల్లం, ఎర్రటి బట్టలు దానం చేస్తే పూర్వీకుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

telugu-news | latest-news | life-style | zodiac-signs

Advertisment
Advertisment
Advertisment