/rtv/media/media_files/2025/02/13/M2ael90rsnp8dxQ7HpVt.jpg)
Kerala Ragging Case
Kerala Ragging Case: కేరళలోని కొట్టాయంలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ(Nursing College)లో పశువుల్లా మారి జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేసిన ఐదుగురు సీనియర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు నెలలుగా తమను చిత్రహింసలకు గురిచేశారని జూనియర్ విద్యార్థులు యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే విద్యార్థులను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. అంతేకాకుండా కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు సీనియర్లను అరెస్ట్ చేశారు. గత నవంబర్ నుంచి తమను హింసించారని విద్యార్థులు చెబుతున్నారు.
Also Read : మేఘా కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. ముంబై హైకోర్టులో జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్!
Also Read : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లికి బిగ్ షాక్.. పోలీసులు నోటీసులు
చేతులను కట్టేసి చిత్రహింసలకు..
అంతేకాకుండా నగ్నంగా ఉంచి భౌతిక దాడులకు పాల్పడ్డారని, మర్మాంగాలపై జిమ్ వస్తువులు ఉంచేవారని, పిన్స్‌తో ప్రైవేట్ భాగాలపై గుచ్చే వారంటూ జూనియర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అంతటి సీనియర్లు ఆగకుండా ముఖం, తలతో పాటు నోటి దగ్గర క్రీమ్ రాసుకోవాలని బెదిరించేవారిని, తమ దగ్గర ఉన్న డబ్బులు సైతం లాక్కునేవారిని చెబుతున్నారు. డిసెంబర్ 13వ తేదీ ఓ జూనియర్ స్టూడెంట్ గదిలోకి వెళ్లిన సీనియర్లు కాళ్లు, చేతులను కట్టేసి చిత్రహింసలకు గురిచేశారు. అంతేకాకుండా బాడీపై లోకేష్ పోశారని, సూదులతో గాయాలు చేశారని విద్యార్థులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: రోజూ ఇవి తిన్నారంటే యూరిక్ యాసిడ్ మాయం
జరిగినదాన్ని మొత్తం మరో విద్యార్థితో వీడియో తీయించారని జూనియర్లు కన్నీటి పర్యంతం అవుతున్నారు. చివరికి ముగ్గురు విద్యార్థులు కొట్టాయంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు థర్డ్ ఇయర్ చదువుతున్న ఐదుగురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. శామ్యూల్ (20), రాహుల్ (22), జీవ్ (18), రిజిల్ (20), వివేక్ (21)ను కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించింది. ఈ ఘటన కేరళ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇది కూడా చదవండి: ఒత్తిడిని తగ్గించే నాలుగు రకాల టీలు.. తప్పక తాగండి