Sabarimala: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్.. ఆరు భాషల్లో స్వామి చాట్‌బాట్

శబరిమల భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కేరళ ప్రభుత్వం స్వామి చాట్‌బాట్‌ను తీసుకొచ్చింది. శబరిమల పూజావిధానం, విమానం, రైళ్లు, పోలీసులు ఇలా అన్ని వివరాలను ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ మొత్తం ఆరు భాషల్లో తెలుసుకునే అవకాశం కల్పించింది.

New Update
swamy (1)

శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. శబరిమల స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు స్వామి పేరుతో కొత్త చాట్‌బాట్‌ను తీసుకొచ్చింది. నవంబర్ 15వ తేదీ నుంచి మండల మకరు విళక్కు పూజ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్వామి చాట్‌బాట్‌ లోగోను ఆవిష్కరించారు.

ఇది కూడా చూడండి: ఉత్కంఠంగా సాగిన మూడో టీ20..భారత్ విజయం

మొత్తం ఆరు భాషల్లో..

ఈ చాట్‌బాట్‌ను ముత్తూట్ గ్రూప్ సహకారంతో కేరళ ప్రభుత్వం రూపొందించారు. శబరిమల గురించి పూర్తి వివరాలను స్మార్ట్‌ఫోన్‌లో మీకు కావాల్సిన భాషలో ఈజీగా తెలుసుకోవచ్చు. ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ మొత్తం ఆరు భాషల్లో అన్ని వివరాలు భక్తులు ఈజీగా తెలుసుకోవాలని ఈ చాట్‌బాట్‌ను ప్రభుత్వం రూపొందించింది.

ఇది కూడా చూడండి: ఈరోజే మనకు బాలల దినోత్సవం..ఏఏ దేశాల్లో ఎప్పుడు జరుపుకుంటారో తెలుసా?

శబరిమలలో పూజా సమయం, దర్శన సమయాలు ఇలా అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. వీటితో పాటు విమానాలు, రైళ్లు, స్థానిక వివరాలు, పోలీసులు, అటవీ శాఖ వివరాలు కూడా ఈ స్వామి చాట్‌బాట్ ద్వారా తెలుసుకోవచ్చు. రేపటి నుంచి యాత్ర ప్రారంభం కావడంతో ఇప్పటికే ట్రావెన్‌కోర్ దేవస్థానం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. 

ఇది కూడా చూడండి: Booker Prize: బుకర్‌ప్రైజ్ విజేతగా మొదటిసారి ఓ మహిళ

శబరిమలలో వేకువ జామున 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. మళ్లీ తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగిస్తారని కేరళ ప్రభుత్వం తెలిపింది. దర్శన సమయాల్లో మార్పుల వల్ల భక్తులకు రోజుకీ 17 గంటల సమయం కేటాయించినట్లు అవుతుంది. 

ఇది కూడా చూడండి: కంగువ ట్విట్టర్ రివ్యూ.. సూర్య బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టినట్లేనా!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Leaf Vegetable: వారానికి ఎన్ని రోజులు ఆకుకూరలు తింటే మంచిది

వారానికి కనీసం మూడు సార్లు ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవాలి. పాలకూర, మెంతికూర, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వంటి తింటే కండరాల నొప్పి, తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఆస్తమా, జీర్ణ, ఒత్తిడి, రక్తపోటు, అధిక బరువును తగ్గిస్తుంది.

New Update

Leaf Vegetable: ఆకుకూరలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ప్రతిరోజూ ఒక రకమైన ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవాలి. ఆకుకూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. వీటిలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చాలా మందికి ఆకుకూరల గురించి తెలిసినప్పటికీ వారు ఈ కూరగాయలను తినడానికి ఇష్టపడరు. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆకుకూరలు తినడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది. ఆకుకూరల్లో విటమిన్ ఎ, సి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. 

గుండె జబ్బులు పరార్:

ఈ ఆకుకూరలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. పాలకూరలో రక్తాన్ని శుద్ధి చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. పాలకూరలో విటమిన్లు ఎ, బి, సి, కె, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించే గుణం దీనికి ఉంది. పాలకూర ఊపిరితిత్తులు, గుండె జబ్బుల నుండి కూడా రక్షిస్తుంది. మెంతికూరలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, సోడియం, రాగి, భాస్వరం, జింక్, వివిధ విటమిన్లు ఉంటాయి. ఇందులోని ఫైబర్ జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. 

ఇది కూడా చదవండి: మందులు లేకుండా సహజంగా బీపీ ఇలా తగ్గించుకోండి

గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. ఇది శ్వాస సమస్యలను నివారిస్తుంది. కండరాల నొప్పి, తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. కరివేపాకు కంటి చూపును మెరుగుపరుస్తుంది. చక్కెర, అధిక బరువు, మలబద్ధకం సమస్యలను నియంత్రిస్తుంది. ఇది యాంటీ బయాటిక్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె, మూత్రపిండాలను రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర వివిధ వంటకాలకు రుచి, సువాసనను జోడించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: భద్రాచలంలో కన్నుల పండుగగా శ్రీరామ నవమి.. భారీగా తరలివచ్చిన భక్తులు


curry-leaf | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)

Advertisment
Advertisment
Advertisment