/rtv/media/media_files/2026/05/29/father-2026-05-29-18-27-33.jpg)
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి వల్ల చాలా మంది పురుషుల్లో సంతానలేమి సమస్యలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీర్య పరీక్ష చేయించుకున్నప్పుడు, అందులో శుక్రకణాలు అస్సలు లేవు లేదా స్పెర్మ్ కౌంట్ జీరో అని రిపోర్ట్ వస్తే.. చాలా మంది మగవారు ఇక జీవితంలో తండ్రి కాలేమేమో అని తీవ్రమైన బాధలోకి, డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నారు. అయితే మీరు అస్సలు కంగారు పడాల్సిన పని లేదు.
ముఖ్యంగా రెండు కారణాలు
కౌంట్ జీరో అవ్వడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉంటాయి. వృషణాలలో శుక్రకణాలు బాగానే తయారవుతాయి. కానీ, అవి బయటకు వచ్చే నరాలలో లేదా దారిలో ఏదైనా బ్లాక్ ఉండటం వల్ల వీర్యంలోకి కలవలేవు. బ్లాక్ అయినా లేదా లోపల చాలా తక్కువగా తయారవుతున్నా.. ఆధునిక పద్ధతుల ద్వారా వృషణాల నుండి నేరుగా శుక్రకణాలను బయటకు తీయవచ్చు. దీనికోసం అడ్వాన్స్‌డ్ సర్జికల్ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఒక చిన్న సూది ద్వారా వృషణాల నుండి నేరుగా లోపల ఉన్న శుక్రకణాలను సేకరిస్తారు. ఒకవేళ కణాలు చాలా తక్కువగా తయారవుతుంటే, మైక్రోస్కోప్ సాయంతో వృషణాలలో ఏ భాగంలోనైనా కణాలు ఉన్నాయేమో వెతికి మరీ పట్టుకుంటారు. ఒక్క బ్రతికున్న శుక్రకణం దొరికినా చాలు!
ఇలా తీసిన శుక్రకణాన్ని ICSI అనే పద్ధతి ద్వారా భార్య అండంలోకి ఇంజెక్ట్ చేసి, గర్భం వచ్చేలా చేస్తారు. కాబట్టి స్పెర్మ్ కౌంట్ జీరో వచ్చినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఊబకాయం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. కాబట్టి రోజుకు కనీసం 30 నుండి 40 నిమిషాలు వాకింగ్ లేదా వ్యాయామం చేయండి.యూట్యూబ్ వీడియోలు చూసి లేదా మెడికల్ షాపుల్లో దొరికే ఏవేవో మాత్రలు, పౌడర్లు వాడకండి. దీనివల్ల ఉన్న హార్మోన్లు మరింత దెబ్బతింటాయి. మానసిక ఒత్తిడి పెరిగితే శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ పడిపోతుంది. ఇది కణాల ఉత్పత్తిని మరింత తగ్గిస్తుంది.
సిగరెట్ కాలచడం, మద్యం సేవించడం వల్ల శుక్రకణాల డిఎన్‌ఏ దెబ్బతింటుంది. ఈ అలవాట్లు ఉంటే వెంటనే మానేయాలి.ల్యాప్‌టాప్ నుంచి వచ్చే వేడి వృషణాలపై పడితే శుక్రకణాలు చనిపోతాయి. అలాగే చాలా టైట్‌గా ఉండే లోదుస్తులు వేసుకోవడం, వేడి నీళ్లతో ఎక్కువగా స్నానం చేయడం మానేయాలి. ల్యాబ్ రిపోర్టులో జీరో అని రాసి ఉన్నంత మాత్రాన మీ జీవితంలో తండ్రి అయ్యే అవకాశం జీరో అయిపోలేదు. సరైన డాక్టర్‌ను సంప్రదించి, కరెక్ట్ ట్రీట్‌మెంట్ తీసుకుంటే మీ సొంత బిడ్డను ఎత్తుకునే భాగ్యం కచ్చితంగా కలుగుతుంది!
Follow Us