Horoscope Today: కెరీర్‌లో ఈ మూడు రాశుల వారికి నేడు తిరుగే లేదు

పన్నెండు రాశుల్లో ఇవాళ ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుంది? వంటి వివరాలను తెలుసుకుందాం.

New Update
New Year 2024 : కొత్త ఏడాదిలో ఈ రాశివారికి సక్సెస్ ఫిక్స్..!!

Horoscope Today

Horoscope Today: పన్నెండు రాశుల్లో ఇవాళ ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుంది? వంటి వివరాలను తెలుసుకుందాం.

మేషం

ఈరోజు మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. తలపెట్టిన ప్రతీ కార్యం విజయం సాధిస్తారు. అయితే మధ్యలోనే పనులను ఆపేయవద్దు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వద్దు.

వృషభం
ఈ రాశి వారికి నేడు వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. అయితే లావాదేవీలు జరిగేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. పనుల్లో ఆటంకం ఏర్పడుతుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. 

మిథునం 
మిథున రాశి విద్యార్థులకు ఈ రోజు మంచి రోజు అని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాల్లో పదోన్నతి లభిస్తుంది. 

కర్కాటక రాశి
కర్కాటకి రాశి వారు నేడు ఏ పని ప్రారంభించిన కూడా విజయం సాధిస్తారు. ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పెద్దలు మీ ప్రవర్తనతో సంతోషిస్తారు. అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

సింహ రాశి
మీరు రోజంతా రిఫ్రెష్‌గా ఉంటారు. ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

కన్యా రాశి
దేవాలయాలను సందర్శిస్తారు. అయితే ప్రయాణ సమయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనులు మధ్యలోనే ఆపేయకూడదు. పూర్తి చేయాలి. 

తుల
నేడు తులా రాశి వారు ఆనందంగా గడుపుతారు. వ్యాపారాల కొరకు కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇతరుల నుంచి ప్రశంసలు పొందుతారు. 

వృశ్చికం
 రోజంతా సంతోషంగా గడుపుతారు. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కెరీర్‌లో అంతా విజయమే సిద్ధిస్తుంది. అసలు మీకు తిరుగే ఉండదు. కాకపోతే కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. 

ధనుస్సు
ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లండి. ప్రణాళికతో వెళ్తే కెరీర్‌ విషయంలో విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు. మీడియా ఉద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈరోజు మీ వైవాహిక జీవితం బాగుంటుంది.

మకరం
ఈరోజు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం కాస్త కుదుట పడుతుంది. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించడానికి ఉపాధ్యాయుల సూచనలు తీసుకోవాలి. 

కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన రోజు. ప్రేమికులతో సంబంధాలు మెరుగుపడతాయి. రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. సంతోషంగా గడుపుతారు.

మీనం 
ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కొత్త వాహనంతో కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు