Raasi Phal: నేడు ఈ రాశి వారు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు!

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రోజు కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధన లాభం ఉంటుందని పండితులు చెబుతున్నారు కన్య రాశి వారికి కలహా సూచన ఉన్నట్లు వివరిస్తున్నారు.ఇంకా ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? అన్న వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

New Update
Zodiac Signs: ఈ 4 రాశుల వారిని అందరు ఇష్టపడతారు!

కొత్త సంవత్సరం మొదలై అప్పుడే రెండు రోజులు గడిచిపోయింది. ఈ క్రమంలోనే మన రోజు వారి జీవితంలో ద్వాదశ రాశుల సంచారం ఎలా ఉంటుందో..ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం.

మేషం రాశి వారికి ఈరోజు..కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతనకార్యాలు ప్రారంభించకుండా ఉంటే బెటర్‌. ఆత్మీయుల సహాయ సహకారాలకోసం సమయం వెచ్చించాల్సి ఉంటుంది.

వృషభం రాశి వారు ఈరోజు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ధనానికి ఇబ్బందులు ఉండవు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో హాయిగా, సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. సమాజంలో గౌరవమర్యాదలు పొందుతారు. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు.

Also Read: Karnataka: ఉచిత బస్‌ ఎఫెక్ట్‌..అక్కడ 15 శాతం పెరిగిన ఛార్జీలు..మరి మన సంగతేంటో!

మానసిక చంచలంతో..

మిథునం రాశివారికి ఈరోజు  ఆర్థిక పరిస్థితిలో ఎటువంటి  మార్పులు ఉండవు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం అవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. మంచి అవకాశాలను కోల్పోతారు.

కర్కాటకం వారు ఈరోజు ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడుతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధపెడతారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలు ఎక్కువ అవుతాయి.

సింహం వారు రోజు కొత్త వారిని నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడటం మంచిది. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడుతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది.

Also Read: Ap Cm Chandra Babu Naidu: విశాఖ, విజయవాడలో మెట్రో రైళ్లు.. ఆ మార్గాల్లో అయితే డబుల్‌ డెక్కర్‌ నే

కన్య రాశి వారికి ఈరోజు మనస్సు చంచలంగా ఉంటుంది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండటం మంచింది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు.

తుల రాశి వారికి  వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతనకార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.

Also Read: Ap: సంక్రాంతికి ఊరెళ్తున్నారా..60 ప్రత్యేక రైళ్లను నడపనున్న సౌత్‌ సెంట్రల్‌ రైల్వే!

వృశ్చికం రాశి వారికి  ఈరోజు స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణలాభం పొందుతారు. విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండటం అవసరం. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలుంటాయి.

ధనుస్సు వారు ఈరోజు చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. కుటుంబ కలహాలు దూరమవుతాయి.

Also Read: Kumbh mela: మరికొన్ని రోజుల్లో మహా కుంభమేళా.. తెలుగు రాష్ట్రాల నుంచి స్పెషల్ ట్రైన్స్

మకరం రాశి వారు ఈరోజు  తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తిచేసుకోగలుగుతారు. బంధు, మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది.

కుంభ రాశి వారు  నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది.

మీనం రాశి వారు ఈరోజు ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరు చేసే ప్రతిపనిలో వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతనకార్యాలు ప్రారంభిస్తారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Life Style: ఆహారంలో ఈ మార్పులతో థైరాయిడ్ ఖతం! ఒకసారి ట్రై చేయండి

థైరాయిడ్ సమస్య ఉన్నవారు దినచర్యలో, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం  థైరాయిడ్‌ను నిర్వహించడానికి సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. 

New Update
Thyroid

Thyroid

Life Style: ఈ మధ్య చాలా మందిలో థైరాయిడ్ సమస్యల సాధారమైపోయింది. జీవనశైలి విధానాలు, ఆహారపు అలవాట్లు దీనికి ప్రధాన కారణాలు అవుతున్నాయి.  దీని వల్ల జుట్టురాలిపోవడం, నెలసరి ఇబ్బందులు, గొంతునొప్పి ఇలా అనేక సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్ రోగి ప్రతిరోజూ ఉదయాన్నే ట్యాబ్లేట్స్ తో రోజును ప్రారంభించాలి. ఇవన్నీ కూడా చాలా కష్టంగా ఉంటాయి. అయితే దినచర్యలో, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం  థైరాయిడ్‌ను నిర్వహించడానికి సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. 

Also Read :  దారిలో మొసళ్లు, పాములు.. అక్రమంగా అమెరికా ఇలా వెళ్లాను.. పంజాబ్ వ్యక్తి కన్నీటి కథ!

కొత్తిమీర గింజల నీరు 

ఉదయాన్నే కొత్తిమీర గింజల నీటిని  తీసుకోవడం థైరాయిడ్ తగ్గించడంలో సహాయపడుతుందని  నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇది థైరాయిడ్ హార్మోన్లను  సమతుల్యం చేయడంలో తోడ్పడుతుంది. 

1 బ్రెజిల్ గింజ

అలాగే ప్రతిరోజు  1 బ్రెజిల్ గింజ తినాలి. దీనిలోని సెలీనియం థైరాయిడ్ పనితీరుకు చాలా అవసరం. అలాగే  జింక్, మెగ్నీషియం ఒమేగా-3లు పుష్కలంగా ఉన్న సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిది.

ఆహారంలో మార్పులు 

 గ్లూటెన్ అధికంగా ఉన్న ఆహారాలు, ప్రాసెస్ చేసిన చక్కెర,  పాల ఉత్పత్తులను డైట్ నుంచి తొలగించండి. ఇవి వాపుకు కారణమవుతాయి.  అలాగే  జీవక్రియను నెమ్మదిస్తాయి. దీనికి బదులుగా అధిక ప్రోటీన్, తక్కువ కార్బ్ భోజనంపై దృష్టి పెట్టండి. 

నాణ్యమైన 

ప్రతి రోజు తగినంత, నాణ్యమైన నిద్ర థైరాయిడ్ తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. అలాగే మెడిటేషన్, వ్యాయామాలు పై కూడా దృష్టి పెట్టండి. బయట ఆహారాలు, ఆయిల్ ఫుడ్స్ వంటి వాటికీ దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. 

telugu-news | life-style | latest-news

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: Allu Arjun - Atlee Movie: బట్టలు చించుకునే టైం ఆగయా.. హాలీవుడ్ రేంజ్‌లో అల్లు అర్జున్ - అట్లీ మూవీ (వీడియో చూశారా)

Advertisment
Advertisment
Advertisment