గ్రహాల మార్పు.. ఈ రాశుల వారికి పట్టనున్న కుభేర యోగం

ఏప్రిల్ 14వ తేదీన సూర్యభగవానుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల మేషం, మిథునం, కర్కాటక, తులా రాశి వారికి కుభేర యోగం పట్టనుందని పండితులు అంటున్నారు. సమస్యలన్నీ తీరిపోయి కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని చెబుతున్నారు.

New Update
horoscope 2025 today

horoscope 2025

కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారిక కుభేర యోగం పట్టనుంది. ఏప్రిల్ 14వ తేదీన సూర్యభగవానుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ క్రమంలో కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుందని పండితులు అంటున్నారు. మరి ఆ రాశులేవో చూద్దాం. 

మేషరాశి

సూర్యుడు మీ రాశిలోకి నేరుగా ప్రవేశించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. సూర్య భగవానుడి దయవల్ల మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి దక్కే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఆర్థికంగా వృద్ధి చెందే సంకేతాలు అధికంగా ఉన్నాయి. నిరుద్యోగుల కలలు నెరవేరుతాయి.

ఇది కూడా చూడండి: USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

మిథున రాశి
సూర్యుని సంచారం మిథున రాశి జాతకులపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. వారి కెరీర్ ఊపందుకునేలా చేస్తుంది. వ్యక్తిగత జీవితంలో కూడా శుభాలు కలుగుతాయి. సూర్య అనుగ్రహంతో ఉద్యోగంలో పదోన్నతిని పొందుతారు. అలాగే ఉద్యోగుల జీతం కూడా పెరగొచ్చు. పోటీ పరీక్షలలో విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. అలాగే పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదనలు అధికంగా వస్తాయి.

ఇది కూడా చూడండి: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కూడా సూర్యుని గమనం శుభప్రదంగా మారుతుంది. ఈ రాశి వారికి సామాజిక, ఆర్థిక రంగాలలో కొత్త అవకాశాలు వస్తాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మతపరమైన వేడుకల్లో హాజరవుతారు. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఇంతకుముందు పూర్తవకుండా మిగిలిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి. 

ఇది కూడా చూడండి: Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

తులా రాశి
తులారాశి వారికి సూర్య సంచారం ఆస్తిని అందించేలా కనిపిస్తోంది. అలాగే మానసిక స్థిరత్వాన్ని కూడా ఇస్తుంది. సూర్య సంచారం వల్ల వారికి ఏకాగ్రత పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా వస్తుంది. అలాగే భూమి, వాహనం లేదా ఆభరణాలు కొనుగోలు కూడా చేసే అవకాశం కల్పిస్తుంది. 

ఇది కూడా చూడండి: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vaishakha Amavasya వైశాఖ అమావాస్య రోజున.. ఈ రాశుల వారు ఇవి దానం చేస్తే అన్నీ శుభాలే !

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 27న వైశాఖ అమావాస్య వస్తుంది. ఈరోజు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అయితే వైశాఖ అమావాస్య రోజున రాశిచక్రం ప్రకారం కొన్ని చర్యలు  చేయడం ద్వారా  శుభ ఫలితాలను కలిగిస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.. 

New Update
Vaishakha Amavasya

Vaishakha Amavasya

Vaishakha Amavasya హిందూ మతవిశ్వాసాల ప్రకారం వైశాఖ అమావాస్య ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఏడాదిలో 12 అమావాస్య తిథులు ఉంటాయి. అందులో వైశాఖ మాసంలో వచ్చే అమావాస్యను వైశాఖ అమావాస్య అంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 27 ఉదయం 4: 28 గంటలకు మొదలై 28 తెల్లవారుజామున 1: 02 గంటలకు ముగుస్తుంది. ఈ ప్రత్యేకమైన రోజున విష్ణువును పూజిస్తారు. అలాగే దానధర్మాలకు కూడా ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. పితృదేవులకు పిండం, తర్పణం కూడా చేస్తారు. అయితే పితృదేవుల ఆత్మశాంతి కోసం  వైశాఖ అమావాస్య రోజున రాశిచక్రం ప్రకారం కొన్ని చర్యలు  చేయడం ద్వారా  శుభ ఫలితాలను కలిగిస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.. 

రాశి చక్రం ప్రకారం చేయాల్సిన పనులు 

మేష రాశి 

 మేష రాశి వారు వైశాఖ అమావాస్య రోజున  తమ పూర్వీకులకు నీరు, షర్బత్, చల్లని వస్తువులను దానం చేయడం శుభ ఫలితాలను కలిగిస్తుంది. 

వృషభ రాశి 

వైశాఖ అమావాస్య రోజున వృషభ రాశి వారు డబ్బు, ఆహారాన్ని దానం చేయడం ద్వారా తమ పూర్వీకులను ప్రసన్నం చేసుకుంటారు. అలాగే శుభఘడియలు కూడా మొదలవుతాయి. 

కర్కాటక రాశి 

ఈ ప్రత్యేకమైన రోజున కర్కాటక రాశి వారు తెల్లటి ఆహార పదార్థాలను, ధనాన్ని ఎక్కువగా దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శుభఫలితాలు కలగడంతో పాటు పూర్వీకుల ఆత్మ శాంతిస్తుంది. 

సింహరాశి 

సింహ రాశివారు బెల్లం, పప్పుదినుస్సులు, తేనే దానం చేయవచ్చు. వైశాఖ అమావాస్య రోజున ఈ దానాలు సింహరాశి వారికి శుభప్రదంగా పరిగణించబడతాయి. 

కన్య రాశి 

వైశాఖ అమావాస్య రోజున కన్య రాశి వారు పూర్వీకుల ఆనందం కోసం నెయ్యితో తయారు చేసిన ఆహార పదార్థాలను దానం చేయాలి. 

తులారాశి 

తులారాశిలో జన్మించినవారు బ్రాహ్మణులకు భోజనం పెట్టడం, తెల్లటి వస్త్రాలను దానం చేయడం ద్వారా శుభాలు చేకూరుతాయి. 

వృచ్చిక రాశి 

వృచ్చిక రాశివారు బెల్లం, ఎర్రటి బట్టలు దానం చేస్తే పూర్వీకుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

telugu-news | latest-news | life-style | zodiac-signs

Advertisment
Advertisment
Advertisment