Clothes And Tea: బట్టలపై టీ మరకలు పోవాలంటే ఇలా శుభ్రం చేయండి

టీ తాగేటప్పుడు బట్టలపై మరకలు పడతాయి. గోరువెచ్చని నీళ్లు పోసి, ఉప్పు, నిమ్మరసం, బేకింగ్ సోడా, టీ మరక మీద నేరుగా వేడి నీటిని పోసి గుడ్డను మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. టీ మరకపై లిక్విడ్ డిటర్జెంట్ వేసి వేళ్లతో సున్నితంగా రుద్దితే మరకలు పోతాయి.

New Update
Tea stains on clothes

Tea stains on clothes

Clothes And Tea: కొన్నిసార్లు టీ తాగేటప్పుడు బట్టలపై మరకలు పడతాయి. దీనివల్ల ఫాబ్రిక్ మీద మరకలు ఏర్పడతాయి. ఈ రకమైన మరకలను తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటాం.  కొంతమంది గోరువెచ్చని నీళ్లు పోసి, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా రుద్దుతారు. దీనితో మరక పోయినా ఆ ప్రాంతంలోని ఫాబ్రిక్ రంగు మసకబారుతుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే టీ మరకలను సులభంగా తొలగించవచ్చని నిపుణులు అంటున్నారు. బేకింగ్ సోడాను సాధారణంగా వంటగదిలో కేకులు, కుకీలు, ఇతర ఆహార పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అయితే బట్టలపై ఉన్న టీ మరకలను తొలగించడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. 

నాణ్యత అంతగా క్షీణించే అవకాశం..

టీ మరకపై ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి సున్నితంగా రుద్దండి. కొద్దిసేపటి తర్వాత బట్టలు శుభ్రం చేస్తే టీ మరక పోతుంది. సాధారణంగా కాటన్ బట్టలపై ఉన్న టీ మరకలను తొలగించడం అంత సులభం కాదు. టీ మరక మీద నేరుగా వేడి నీటిని పోయాలి. అయితే చాలా వేడి నీటిని ఉపయోగించవద్దు. వేడి ఎంత ఎక్కువగా ఉంటే ఫాబ్రిక్ నాణ్యత అంతగా క్షీణించే అవకాశం ఉంది. అందువల్ల మధ్యస్తంగా వేడి నీటిని తీసుకోవడం మంచిది. టీ మరకలను తొలగించడంలో వెనిగర్ కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీని కోసం  ఒక కప్పు నీటిలో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి బాగా కలపాలి. ఈ ద్రవాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి మరకలు ఉన్న ప్రదేశంలో స్ప్రే చేయండి. తర్వాత మెల్లగా రుద్దండి.

ఇది కూడా చదవండి: ఇంట్లో మనీ ప్లాంట్లు ఇక్కడ పెట్టండి... డబ్బే డబ్బు!

ఇలా చేయడం వల్ల మరక క్రమంగా మాయమవుతుంది. ఫాబ్రిక్ రంగు మారకుండా టీ మరకలను సులభంగా తొలగించడానికి టూత్‌పేస్ట్‌ను ఉపయోగించవచ్చు. మరక ఉన్న ప్రదేశంలో కొంత టూత్‌పేస్ట్‌ను అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గుడ్డను మంచి నీటితో శుభ్రం చేసుకోండి. బట్టలపై టీ పడిన వెంటనే నీటితో శుభ్రం చేస్తే మరక సులభంగా తొలగిపోతుంది. అది సాధ్యం కాకపోతే ఆ గుడ్డను చల్లని నీటిలో అరగంట సేపు నానబెట్టి తర్వాత ఉతకాలి. చాలా మంది టీ మరకలను తొలగించడానికి నిమ్మరసాన్ని ఉపయోగిస్తారు. అయితే దాని బ్లీచింగ్ లక్షణాల కారణంగా రంగుల బట్టలు మసకబారే అవకాశం ఉంది. కాబట్టి ఈ చిట్కాను తెల్లని బట్టలకు మాత్రమే ఉపయోగించడం ఉత్తమం. టీ మరక ఉన్న ప్రదేశంలో కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ వేసి వేళ్లతో సున్నితంగా రుద్దండి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఉదయం 9 గంటలలోపు ఈ ఐదు పనులు చేయండి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vaishakha Amavasya వైశాఖ అమావాస్య రోజున.. ఈ రాశుల వారు ఇవి దానం చేస్తే అన్నీ శుభాలే !

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 27న వైశాఖ అమావాస్య వస్తుంది. ఈరోజు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అయితే వైశాఖ అమావాస్య రోజున రాశిచక్రం ప్రకారం కొన్ని చర్యలు  చేయడం ద్వారా  శుభ ఫలితాలను కలిగిస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.. 

New Update
Vaishakha Amavasya

Vaishakha Amavasya

Vaishakha Amavasya హిందూ మతవిశ్వాసాల ప్రకారం వైశాఖ అమావాస్య ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఏడాదిలో 12 అమావాస్య తిథులు ఉంటాయి. అందులో వైశాఖ మాసంలో వచ్చే అమావాస్యను వైశాఖ అమావాస్య అంటారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 27 ఉదయం 4: 28 గంటలకు మొదలై 28 తెల్లవారుజామున 1: 02 గంటలకు ముగుస్తుంది. ఈ ప్రత్యేకమైన రోజున విష్ణువును పూజిస్తారు. అలాగే దానధర్మాలకు కూడా ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. పితృదేవులకు పిండం, తర్పణం కూడా చేస్తారు. అయితే పితృదేవుల ఆత్మశాంతి కోసం  వైశాఖ అమావాస్య రోజున రాశిచక్రం ప్రకారం కొన్ని చర్యలు  చేయడం ద్వారా  శుభ ఫలితాలను కలిగిస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.. 

రాశి చక్రం ప్రకారం చేయాల్సిన పనులు 

మేష రాశి 

 మేష రాశి వారు వైశాఖ అమావాస్య రోజున  తమ పూర్వీకులకు నీరు, షర్బత్, చల్లని వస్తువులను దానం చేయడం శుభ ఫలితాలను కలిగిస్తుంది. 

వృషభ రాశి 

వైశాఖ అమావాస్య రోజున వృషభ రాశి వారు డబ్బు, ఆహారాన్ని దానం చేయడం ద్వారా తమ పూర్వీకులను ప్రసన్నం చేసుకుంటారు. అలాగే శుభఘడియలు కూడా మొదలవుతాయి. 

కర్కాటక రాశి 

ఈ ప్రత్యేకమైన రోజున కర్కాటక రాశి వారు తెల్లటి ఆహార పదార్థాలను, ధనాన్ని ఎక్కువగా దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శుభఫలితాలు కలగడంతో పాటు పూర్వీకుల ఆత్మ శాంతిస్తుంది. 

సింహరాశి 

సింహ రాశివారు బెల్లం, పప్పుదినుస్సులు, తేనే దానం చేయవచ్చు. వైశాఖ అమావాస్య రోజున ఈ దానాలు సింహరాశి వారికి శుభప్రదంగా పరిగణించబడతాయి. 

కన్య రాశి 

వైశాఖ అమావాస్య రోజున కన్య రాశి వారు పూర్వీకుల ఆనందం కోసం నెయ్యితో తయారు చేసిన ఆహార పదార్థాలను దానం చేయాలి. 

తులారాశి 

తులారాశిలో జన్మించినవారు బ్రాహ్మణులకు భోజనం పెట్టడం, తెల్లటి వస్త్రాలను దానం చేయడం ద్వారా శుభాలు చేకూరుతాయి. 

వృచ్చిక రాశి 

వృచ్చిక రాశివారు బెల్లం, ఎర్రటి బట్టలు దానం చేస్తే పూర్వీకుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

telugu-news | latest-news | life-style | zodiac-signs

Advertisment
Advertisment
Advertisment