Lion: సింహం వేట చూసి ఉంటారు...అది ప్రేమిస్తే ఇలాగే ఉంటది

సింహాన్ని కలవడానికి ఒక వ్యక్తి గేటు తెరవడం మనం చూడవచ్చు. ఆ తర్వాత సింహం తన రక్షకునిపై ప్రేమను ప్రదర్శించింది.చాలా రోజుల తర్వాత ఓ సంరక్షకుడు సింహం ఉండే బోను దగ్గరికి వెళ్ళాడు. అతనితో ఆ సింహం చూపించే ప్రేమ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
lion

Lion

Lion: జంతువులు మనుషుల కంటే ఎంతో విశ్వాసంగా ఉంటాయి. శునకాల సంగతి అయితే ఇక చెప్పక్కర్లేదు. పెంపుడు జంతువుల సంగతి ఇలా ఉంటే.. క్రూర మృగాలను చూస్తే మనుషులు వణికి పోతారు. సింహాలు, పులులు అంటే ఆమడ దూరం పరిగెత్తుతారు. కానీ వేటాడడమే కాదు తాము ప్రేమించగలమని, మమకారం చూపించగలమని రుజువు చేస్తున్నాయి కొన్ని సింహాలు. చాలా రోజుల తర్వాత ఓ సంరక్షకుడు సింహం ఉండే బోను దగ్గరికి వెళ్ళాడు. 

రక్షకునిపై ప్రేమను ప్రదర్శించిన సింహం:

అతనితో ఆ సింహం చూపించే ప్రేమ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. హృదయాలు కదిలించి వేస్తుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఓ వినియోగదారు ఈ వీడియో పోస్ట్ చేశాడు. సింహాన్ని కలవడానికి ఒక వ్యక్తి గేటు తెరవడం మనం చూడవచ్చు. ఆ తర్వాత సింహం తన రక్షకునిపై ప్రేమను ప్రదర్శించింది. వీడియో త్వరగా ప్రజాదరణ పొందింది, 10 మిలియన్లకుపైగా వీక్షణలు, అనేక లైక్‌లు, షేర్‌లను పొందింది.

Also Read: ఎక్కువ సేపు పడుకుంటున్నారా..? మీ పని అంతే

సింహం రక్షకుని వైపు సింహం ఆనందంగా పరుగెత్తుతూ వెళ్లి అతనితో ఆడుకోవడం చూస్తుంటే ఇద్దరి మధ్య ఎంత లోతైన బంధం ఉందో  తెలుస్తుంది. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోపై వ్యాఖ్యానిస్తూ ఇద్దరు మొత్తానికి మళ్ళీ కలుసుకున్నందుకు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి.. వైల్డ్‌గా కనిపించే సింహం ఇంత ప్రేమ చూపిస్తుందా అంటూ కామెంట్ చేశాడు.

Also Read: Mohan Babu: హైకోర్టుకు మోహన్ బాబు!

 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. 

Also Read:  అల్పాహారం, రాత్రి భోజనం మానేస్తున్నారా..? ఈ సమస్యలు తప్పవు

Also Read:  ఈ వస్తువులతో పాములు పరార్‌.. వాసన వల్ల మళ్లీ కనిపించవు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Leaf Vegetable: వారానికి ఎన్ని రోజులు ఆకుకూరలు తింటే మంచిది

వారానికి కనీసం మూడు సార్లు ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవాలి. పాలకూర, మెంతికూర, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వంటి తింటే కండరాల నొప్పి, తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఆస్తమా, జీర్ణ, ఒత్తిడి, రక్తపోటు, అధిక బరువును తగ్గిస్తుంది.

New Update

Leaf Vegetable: ఆకుకూరలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ప్రతిరోజూ ఒక రకమైన ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవాలి. ఆకుకూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. వీటిలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చాలా మందికి ఆకుకూరల గురించి తెలిసినప్పటికీ వారు ఈ కూరగాయలను తినడానికి ఇష్టపడరు. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆకుకూరలు తినడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది. ఆకుకూరల్లో విటమిన్ ఎ, సి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. 

గుండె జబ్బులు పరార్:

ఈ ఆకుకూరలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. పాలకూరలో రక్తాన్ని శుద్ధి చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. పాలకూరలో విటమిన్లు ఎ, బి, సి, కె, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించే గుణం దీనికి ఉంది. పాలకూర ఊపిరితిత్తులు, గుండె జబ్బుల నుండి కూడా రక్షిస్తుంది. మెంతికూరలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, సోడియం, రాగి, భాస్వరం, జింక్, వివిధ విటమిన్లు ఉంటాయి. ఇందులోని ఫైబర్ జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. 

ఇది కూడా చదవండి: మందులు లేకుండా సహజంగా బీపీ ఇలా తగ్గించుకోండి

గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. ఇది శ్వాస సమస్యలను నివారిస్తుంది. కండరాల నొప్పి, తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. కరివేపాకు కంటి చూపును మెరుగుపరుస్తుంది. చక్కెర, అధిక బరువు, మలబద్ధకం సమస్యలను నియంత్రిస్తుంది. ఇది యాంటీ బయాటిక్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె, మూత్రపిండాలను రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర వివిధ వంటకాలకు రుచి, సువాసనను జోడించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: భద్రాచలంలో కన్నుల పండుగగా శ్రీరామ నవమి.. భారీగా తరలివచ్చిన భక్తులు


curry-leaf | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news)

Advertisment
Advertisment
Advertisment