Sri Rama Navami 2026: అదృష్టమంటే వీరిదే.. శ్రీరామ నవమి నుంచి ఈ రాశుల వారికి అదృష్టమే!

శ్రీరామ నవమి నుంచి మేషం, మిథునం, తుల, ధనుస్సు రాశుల వారికి అన్ని విధాలుగా మంచి జరగనుంది. ఏ పని తలపెట్టినా జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

author-image
By Kusuma
New Update
horoscope

horoscope

శ్రీరామ నవమి నుంచి కొన్ని రాశుల వారికి అన్ని విధాలుగా మంచి జరగనుంది. ఏ పని తలపెట్టినా జరుగుతుంది. అలాగే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు. మరి శ్రీరామ నవమి నుంచి ఏయే రాశుల వారికి అదృష్టం పట్టబోతుందో చూద్దాం.

ఇది కూడా చూడండి: హిందూ మహాసముద్రంలో చైనా ‘సైలెంట్’ వార్.. భారత్ తీరంలో డ్రాగన్ నౌకల నిఘా!

మేష రాశి

మేష రాశి వారికి శ్రీరామనవమి నుంచి అంతా మంచే జరగనుంది. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు అన్ని కూడా వేగంగా పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. డబ్బు వృద్ధి చెందే మార్గాలు ఎక్కువగా ఉంటాయని పండితులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: ఇండియాకు ఇరాన్ గుడ్‌న్యూస్.. 5 మిత్రదేశాలకు హర్మూజ్ జలసంధి పర్మిషన్

మిథున రాశి

మిథున రాశి వారికి గత కొంతకాలంగా ఉన్న మానసిక ఒత్తిడి తొలగిపోతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు భారీ లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు లభిస్తాయి. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ఆటంకాలు తొలగి, అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.

సింహ రాశి

ఈ రాశి వారికి సామాజిక గౌరవం పెరుగుతుంది. రాజకీయ లేదా ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి విశేషమైన గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో ఉన్న కలహాలు సర్దుమణిగి ప్రశాంతత నెలకొంటుంది. పాత బాకీలు వసూలై ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అంటున్నారు.

ఇది కూడా చూడండి: Vande Bharat Express: పెరుగులో పురుగులు.. ఇండియన్ రైల్వేస్‌కు భారీ జరిమానా

తుల రాశి

తుల రాశి వారికి ఈ శ్రీరామ నవమి నుంచి అదృష్ట దేవత తలుపు తట్టబోతోంది. కొత్త ఆస్తులు లేదా వాహనాలు కొనుగోలు చేసే యోగం ఉంది. సంతానం లేని వారికి శుభవార్తలు అందుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సమాజంలో స్థాయి పెరుగుతుంది. గౌరవం అన్ని కూడా లభిస్తాయని పండితులు అంటున్నారు. 

ధనస్సు రాశి

ధనస్సు రాశి వారు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. కోర్టు కేసులు లేదా ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. మీరు చేసే పెట్టుబడులు భవిష్యత్తులో భారీ లాభాలను తెచ్చిపెడతాయని పండితులు చెబుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు