/rtv/media/media_files/2025/05/26/wbAftIYW5uGBqDMcIwUq.jpg)
Sugar Test
నేరేడు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ సి, ఐరన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఫుల్‌గా ఉంటాయి. అయితే ఈ పండ్లను సరైన పద్ధతిలో తింటేనే ఆరోగ్యమని లేకపోతే విషమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ పండ్లు ఎలా తినాలి? ఎవరెవరు ఎంత మోతాదులో తీసుకోవాలి? పూర్తి వివరాల్లో తెలుసుకుందాం.
ఇది కూడా చూడండి: Mina Ala Fahal terminal : ఒమన్ ఆయిల్ టర్మినల్‌పై డ్రోన్ దాడి.. నిలిచిపోయిన చమురు లోడింగ్!
నేరేడు పండ్లు తినడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైడ్ శరీరంలో పిండిపదార్థాలు చక్కెరగా మారకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి. కేవలం పండే కాకుండా.. నేరేడు గింజల పొడి కూడా షుగర్ వ్యాధిగ్రస్తులకు సంజీవనిలా పనిచేస్తుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా నేరేడు పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే ఈ పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య నుండి కాపాడుతుంది. ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి.. వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ ఇస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి.
ఎవరెవరు తినకూడదు?
నేరేడు పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ కొందరు అసలు తినకూడదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పాలు ఇచ్చే తల్లులు నేరేడు పండ్లను తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే కొన్ని రసాయనాలు, అధిక ఐరన్ కంటెంట్ వారి శరీరంలో వేడిని పెంచే అవకాశం ఉంది. అలాగే కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కూడా ఈ పండ్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే నేరేడులో పొటాషియం, ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే సర్జరీ చేయించుకోబోయే వారు లేదా ఇటీవల సర్జరీ అయిన వారు ఈ పండ్లను అస్సలు తినకూడదు. నేరేడు పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా తగ్గిస్తాయి. సర్జరీ సమయంలో లేదా తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోతే ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. కాబట్టి ఆపరేషన్‌కు కనీసం రెండు వారాల ముందు నుంచే నేరేడు పండ్లు తినడం ఆపేయాలి.
ఇది కూడా చూడండి: Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్: చైనా, టర్కీ ఆయుధాలపై పాక్ కన్ను!
ఏదైనా సరే మితిమీరితే అమృతం కూడా విషంగా మారుతుంది. నేరేడు పండ్లను కూడా ఒక పరిమితి లోపలే తినాలి. రోజుకు 100 నుండి 150 గ్రాములు మాత్రమే తినాలి. అంతకంటే ఎక్కువ తింటే కడుపునొప్పి, గ్యాస్, మలబద్ధకం వంటి అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. వీటిని ఎప్పుడూ ఖాళీ కడుపుతో తినకూడదు. ఖాళీ కడుపుతో తింటే అందులోని యాసిడ్ల వల్ల కడుపులో మంట, ఎసిడిటీ వస్తాయి. అలాగే నేరేడు పండ్లు తిన్న వెంటనే పాలు తాగకూడదు. పండ్లు తిన్న తర్వాత కనీసం రెండు గంటల గ్యాప్ ఇచ్చి మాత్రమే పాలు లేదా పాల పదార్థాలు తీసుకోవాలి. లేదంటే చర్మ సమస్యలు లేదా జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
Follow Us