12 వారాలు ఇలా చేస్తే సంతానలేమి సమస్య ఉండదు!

సంతానలేమి మన దేశంలో పెను సమస్యగా మారింది. అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ, ఆహారం, జీవనశైలి మార్పులతో కూడా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నిపుణులు అంటున్నారు. కీటో డైట్ పాటించడం వల్ల ఈ ఇన్ఫెర్టిలిటీ సమస్యను పరిష్కరించుకోవచ్చని చెబుతున్నారు.

New Update
PCOS

PCOS: క్రమరహిత ఋతు చక్రాలు, ముఖంపై వెంట్రుకలు పెరగడం, మొటిమలు వంటి లక్షణాలు ఉంటాయి. ఈ సమస్య ఉన్న మహిళల్లో మగ హార్మోన్లు అని పిలువబడే ఆండ్రోజెన్‌లు అధిక స్థాయిలో ఉంటాయి. ఇది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను కలిగిస్తుంది కాబట్టి ఇది టైప్ 2 డయాబెటిస్‌ను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది. దీంతో బరువు తగ్గడం సవాల్‌గా మారుతుంది. అందువల్ల పీసీఓఎస్‌ ఉన్న మహిళల్లో ఊబకాయం, గుండె సమస్యలు కూడా ఉంటాయి. జీవనశైలిలో మార్పులు, ఆహారం, వ్యాయామం వంటి వాటి ద్వారా పీసీఓఎస్ ప్రభావం నుంచి బయటపడవచ్చు. అలాగే 12 వారాల పాటు కీటో డైట్ తీసుకోవడం వల్ల పీసీఓఎస్ ప్రభావం అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కీటో డైట్:

కీటో డైట్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇష్టపడే పద్ధతి. మన ఊర్లో కూడా చాలా మంది సెలబ్రిటీలు ఈ కీటో డైట్ పద్ధతితో బరువు తగ్గారు. తక్కువ కార్బోహైడ్రేట్లను తీసుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. శరీరానికి అవసరమైన కేలరీలను కార్బోహైడ్రేట్‌లకు బదులుగా కొవ్వుతో నింపడమే కీటోడైట్‌. మన శరీరానికి రోజూ కనీసం 130 గ్రాముల కార్బోహైడ్రేట్లు అవసరం. శరీరానికి అవసరమైన ఇతర కేలరీలు కొవ్వు, ప్రోటీన్ల నుండి లభిస్తాయి. ఈ కీటో డైట్‌లో కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. 

కొవ్వుతో కూడిన ఆహారాలు:

మనం తినే ఆహారంలో 70-75శాతం సాధారణంగా కొవ్వుతో సమృద్ధిగా ఉంటుంది. ఇందులో 20-25శాతం ప్రోటీన్, 5-10శాతం కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కార్బోహైడ్రేట్లను తగ్గించడం వల్ల మన శరీరం కీటోసిస్ అనే స్థితికి చేరుకుంటుంది. దీని అర్థం శరీరం పనిచేయడానికి అవసరమైన శక్తి కోసం కొవ్వును ఉపయోగించడం ప్రారంభిస్తుంది. కార్బోహైడ్రేట్‌లను తగ్గించడం, కొవ్వులు పెరగడం వల్ల పీసీఓఎస్‌ నియంత్రణలో ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఇన్సులిన్‌ లెవల్స్‌ను నియంత్రించి హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. 12 వారాల తర్వాత ఆకలి తగ్గుతుందని, బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయని అంటున్నారు.

12వ వారం ముఖ్యం:

బరువు తగ్గడం, PCOS లక్షణాలు 12 వారాలలో తగ్గిపోయినప్పటికీ, మీరు ఈ ఆహారాన్ని ఆపివేసిన తర్వాత మళ్లీ బరువు పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. 12వ వారం తర్వాత కార్బోహైడ్రేట్లను మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ డైట్‌లో వెన్న, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె, నట్స్, చేపలను తినవచ్చు. అలాగే కోడి కూర, బ్రోకలీ, కాలీఫ్లవర్‌లను ఎక్కువగా తినవచ్చు. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ వంటి బెర్రీలతో పాటు చీజ్, హెవీ క్రీమ్ వంటి పాల ఉత్పత్తులను మితంగా తీసుకోవచ్చని వైద్యులు అంటున్నారు.

ఏం తినాలి?

మనం కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే, సహజంగా చక్కెర అధికంగా ఉండే అరటి, యాపిల్, ద్రాక్ష వంటి పండ్లను తీసుకోకూడదు. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలని, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలని వైద్యులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు