Diwali 2024: దీపావళికి ఇల్లంతా దీపాలు.. ఎందుకో తెలుసా? అసలు కథ ఏంటి? దీపావళి రోజున దీపాలు ఎందుకు వెలిగిస్తారు..? దీపావళి అంటే దీపం అని అర్థం. దీపాన్ని జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందాలకు చిహ్నంగా భావిస్తారు. అందుకే దీపావళి రోజున లక్ష్మీ దేవికి స్వాగతం పలికేందుకు ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారని చెబుతారు. By Archana 29 Oct 2024 | నవీకరించబడింది పై 31 Oct 2024 09:51 IST in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update Diwali 2024 షేర్ చేయండి Diwali 2024: దీపావళి, హిందువులకు అతిపెద్ద పండుగ. ఈ పర్వదినాన శ్రీ లక్ష్మీ, గణేశుడు, సంపదలకు రాజైన కుబేరుడిని పూజించడం ద్వారా ఆనందం, శ్రేయస్సును పొందుతారు. పంచాంగం ప్రకారం ఈ ఏడాది దీపావళి కార్తీకమాసంలోని అమావాస్య తిథి గురువారం అక్టోబర్ 31, 2024 మధ్యాహ్నం 2:52 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే శుక్రవారం నవంబర్ 1 సాయంత్రం 6:16 గంటలకు ముగుస్తుంది. Also Read : ఇజ్రాయెల్ కొత్త స్కెచ్.. ఇదే జరిగితే యుద్ధం తప్పదా? అయితే దీపావళి సమయంలో మూడు లేదా ఐదు రోజుల పాటు ఇంట్లో దీపాలను వెలింగించడం చేస్తుంటారు. ఇలా వీలుకాని వారు దీపావళి ఒక్కరోజైన వెలిగిస్తారు. అసలు దీపావళి రోజున దీపాలను ఎందుకు వెలిగిస్తారు..? దీని వెనుక స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. Also Read: అలా చేస్తే వచ్చే పాపులారిటీ అక్కర్లేదు.. వైరలవుతున్న సాయి పల్లవి కామెంట్స్ దీపాలను ఎందుకు వెలిగిస్తారు. దీపావళి అంటే దీపాల పండగ. అష్టాదశపురాణాల ప్రకారం దీపం అంటే పరబ్రహ్మ స్వరూపం అని అర్థం. అందుకే దీపావళి రోజున ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. పురాణాల ప్రకారం శ్రీరాముని వేల సంవత్సరాల క్రితం శ్రీరాముడి రాకను పురస్కరించుకొని అయోధ్య ప్రజలు తమ ఇళ్లను దీపాల కాంతితో నింపారట. అలాగే దీపావళి రోజున లక్ష్మీ దేవికి స్వాగతం పలికేందుకు ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారని చెబుతారు. అంతేకాదు దీపాన్ని జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందాలకు చిహ్నంగా భావిస్తారు. అందుకే దీపావళి పర్వదినాన తప్పనిసరిగా ఇంట్లో దీపాలను పెడతారు. దీపాలను నువ్వుల నూనె, లేదా ఆవు నెయ్యితో వెలిగిస్తే మంచిదని నమ్ముతారు. Also Read : ఈ పప్పులను అధికంగా తీసుకుంటే గ్యాస్ సమస్య గ్యారంటీ.. సైన్స్ ప్రకారం.. సైన్స్ ప్రకారం దీపావళి సమయంలో చలి మొదలవుతుంది. ఈ టైంలో జలుబు, దగ్గు, జ్వరాలు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తారు. ఈ దీపాల పొగ వాసన పీల్చడం ద్వారా ఇటువంటి వ్యాధులు దరిచేరవని చెబుతారు. Also Read: 24ఏళ్ల తర్వాత తొలిసారి.. ప్రపంచ వేదికపై భారతీయ అందాల భామకు కిరీటం #life-style #diwali-festival #diwali-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి