పీరియడ్స్ సమయంలో మహిళల శరీరం అనేక శారీరక, మానసిక మార్పులకు లోనవుతుంది. ఈ సమయంలో సంభవించే మార్పులను ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ (PMS) అంటారు. కడుపు నొప్పి, అలసట, బలహీనత, రొమ్ము నొప్పి, మూడ్ స్వింగ్స్ ఇలా అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది మహిళలు విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు. మరికొంతమంది శరీరాన్ని యాక్టీవ్ గా ఉండడానికి తేలికపాటి వ్యాయామాలు చేస్తారు.
తేలికపాటి వ్యాయామం చేయడం సరేకానీ.. పీరియడ్స్ సమయంలో పరిగెత్తడం, గెంతడం వంటివి చేయొచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే నిపుణులు అభిప్రాయం ప్రకారం.. నెలసరి టైంలో అరగంట సేపు పరుగెత్తడం ద్వారా శరీరం రిలాక్స్ అవుతుందట. అంతేకాదు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. అదేపనిగా పరుగెత్తడం చాలా ప్రమాదకరం. వేగంగా కాకుండా నెమ్మదిగా పరుగెత్తాలి.
పరిగెత్తితే ఏమవుతుంది?
రక్త ప్రసరణను
నెలసరి సమయంలో పరుగెత్తడం రక్త ప్రసరణనను మెరుగుపరుస్తుంది. సరైన రక్తప్రసరణ పెల్విన్ ప్రాంతంలో కలిగే ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
మానసిక స్థితి
పీరియడ్స్ సమయంలో తేలికగా పరిగెత్తడం లేదా జాగింగ్ చేయడం వల్ల ఒత్తిడి హార్మోన్ (కార్టిసాల్) స్థాయిలు తగ్గడానికి ఉపయోగపడుతుంది. , ఇది చిరాకు, మూడ్ స్వింగ్స్ ని అదుపులో ఉంచుతుంది.
నొప్పి నుంచి ఉపశమనం
పీరియడ్స్ సమయంలో పరుగెత్తడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు (హ్యాపీ హార్మోన్లు) రిలీజ్ అవుతాయి. ఇవి పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి, మూడ్ స్వింగ్స్ ని తగ్గించడంలో సహాయపడతాయి.
ఎనర్జీ
పీరియడ్స్ సమయంలో అలసట, బలహీనత సర్వసాధారణం.
ఈ సమయంలో పరుగెత్తడం వల్ల శరీరంలో శక్తి స్థాయి పెరుగుతుంది. దీనివల్ల నీరసం తగ్గుతుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- డీహైడ్రేషన్‌కు గురైనవారి పరిగెత్తడం మంచిది కాదు.
- అలాగే పీరియడ్స్ సయమంలో అదేపనిగా పరుగెత్తడం చాలా ప్రమాదకరం. వేగంగా కూడా పరుగెత్తవద్దు. నెమ్మదిగా పరుగెత్తాలి.
- ఋతుక్రమ నొప్పి తీవ్రంగా ఉంటే పరుగెత్తడం మానుకోండి.