/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/What-happens-if-men-eat-fenugreek-in-winter_-jpg.webp)
ఆరోగ్యానికి ఆకు కూరలు ఎంతగానే మేలు చేస్తాయి. వీటిని డైలీ తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఆకుకూరల్లో మెంతికూరను చాలా మంది పెద్దగా తినరు. దీన్ని డైలీ తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మెంతికూరలోని పోషకాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
ఇది కూడా చూడండి: TG crime: ఇళ్లు కోసం వచ్చారు.. ఇద్దర్ని చంపారు.. ఖమ్మంలో కలకలం
బరువు తగ్గాలనుకునేవారికి..
జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారికి మెంతికూర బాగా సాయపడుతుంది. వారికి మెంతులు కూడా బాగా పని చేస్తాయి. ముఖ్యంగా అజీర్ణం, కడుపునొప్పి, గ్యాస్ సమస్యలతో బాధపడేవారికి మెంతులు బాగా ఉపయోగపడతాయి. బరువు తగ్గాలనుకునే వారు ఎలాంటి చిట్కాలు పాటించకుండా మెంతికూర తినడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: TG crime: తెలంగాణలో షాకింగ్ ఘటన.. రన్నింగ్ ట్రైన్లో వృద్ధురాలిని రేప్ చేసి.. !
ఇందులో ఉండే పీచు, ఫైబర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే ఆకలిని నియంత్రిస్తుంది. దీంతో పాటు మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మెంతికూర చక్కగా పనిచేస్తుతంది. ఇందులోని పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారు డైట్‌లో మెంతికూరను చేర్చుకుంటే ఆరోగ్యానికి మంచిది.
ఇది కూడా చూడండి: నెల్లూరు టీడీపీలో ఫైట్.. మంత్రి నారాయణ Vs ఎమ్మెల్యే కోటంరెడ్డి!
మెంతికూరలో శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్, ఫైబర్ ఉన్నాయి. ఇవి లైంగిక సమస్యలను కూడా క్లియర్ చేస్తాయి. ముఖ్యంగా నెలసరి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ మెంతి కూరను తినడం వల్ల ప్రయోజనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Ajahn Siripanyo: బౌద్ధ సన్యాసిగా మారిన 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.