/rtv/media/media_files/2025/03/03/CZ3BZZetR2dHKirQGzIm.jpg)
Health Issues PLASTIC Photograph: (Health Issues PLASTIC)
ప్రస్తుతం మారిన జీవనశైలి వల్ల చాలామంది మహిళలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పురుషులతో పోటీగా మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. కుటుంబ బాధ్యతలు, ఇంట్లో పని, ఆఫీస్‌లో పని వల్ల వాళ్ల ఆరోగ్యంపై అంతగా దృష్టి పెట్టడం లేదు. జ్వరం, ఇంకా ఏదైనా వచ్చిన కూడా ఏం కాదులే అని వదిలేస్తారు. ఇలా చిన్న సమస్యలను పెద్దగా చేసుకుని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే డైలీ తీసుకునే కొన్ని ఆహారాల వల్ల మహిళలు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: ఐదో సారి తల్లి కాబోతున్న సీమా హైదర్... తండ్రిగా సచిన్ మీనాకు ప్రమోషన్ !
అన్ని పదార్థాలు అందులోనే..
ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ప్లాస్టిక్‌లో ఉండే ఆహారాలు ఎక్కువ అయ్యాయి. వీటివల్ల మహిళలు క్యాన్సర్ బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మనం తినే ప్రతీ వస్తువు కూడా ప్లాస్టిక్‌తోనే వస్తుంది. చిన్న పిల్లలు తినే పదార్థాల నుంచి అన్ని కూడా ప్లాస్టిక్‌తోనే ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా సూపర్ మార్కెట్‌లో పండ్లు, కూరగాయలు, వాటి ముక్కలను కూడా కట్ చేసి ప్లాస్టిక్ దాంట్లోనే అమ్ముతున్నారు. ఎక్కువ రోజలు ప్లాస్టిక్‌లో నిల్వ ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పకుండా వస్తాయి.
ఇది కూడా చూడండి: Blankets: దుప్పట్లు వాసన వస్తున్నాయా.. ఇలా చేస్తే సువాసన వెదజల్లుతాయి
ప్లాస్టిక్ ప్యాకెట్‌లో పీఎఫ్‌ఏ పాలేట్లు ఉంటాయి. ఇవి అంత తొందరగా నశించవు. ఇందులో ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల అందులోని రసాయనాలు ఈజీగా కడుపులోకి వెళ్లిపోతాయి. దీంతో క్యాన్సర్ వంటి ప్రమాదాకర వ్యాధులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్‌తో తయారు చేసిన పదార్థాలు అసలు తినకూడదు. ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరూ కూడా అన్నింటికి ప్లాస్టిక్ డబ్బాలు వాడుతున్నారు. ఆఖరికి తినే ప్లేట్లు కూడా ప్లాస్టిక్. పిల్లలు వాడే వాటర్ బాటిల్, స్నాక్స్, లంచ్ ఇలా అన్నింటికి కూడా ప్లాస్టిక్ వినియోగిస్తున్నారు. ఇలా చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Oscar Awards 2025 : ఆస్కార్ అవార్డులు ప్రదానోత్సవం .. విజేతలు వీళ్లే!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Oscars 2025: అందరూ చూస్తుండగానే అతడిని ముద్దు పెట్టుకుంది.. ఇది రెండో సారి!!