Running: 10 నిమిషాల రన్నింగ్‌తో ఆ ప్రమాదకరమైన వ్యాధులు దూరం

ప్రతిరోజూ10 నిమిషాలు పరుగెత్తడం వల్ల ఒత్తిడి, ఆందోళన, నిరాశ, గుండె, నిద్ర వంటి సమస్యలు తగ్గుతాయి. రన్నింగ్ వల్ల మెదడులో ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదల చేసి మానసిక స్థితిని చక్కగా ఉంచుతుంది. రన్నింగ్ ద్వారా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Running

Running

Running: ప్రతిరోజూ10 నిమిషాలు పరుగెత్తడం వల్ల  శరీరం బెనిఫిట్స్‌తో పాటు ప్రమాదకరమైన వ్యాధులు దూరం అవుతాయి. ఫిట్‌నెస్ కోసం సమయం లేని వ్యక్తులు. కేవలం10 నిమిషాల పాటు పరిగెత్తడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. బరువు తగ్గడంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రోజంతా చేసే శారీరక శ్రమ కూడా ముఖ్యం. ఆరోగ్యంగా ఉండటానికి, స్థూలకాయాన్ని తగ్గించడానికి, ప్రతిరోజూ 45 నిమిషాలు నడవడం మంచిది. కానీ సమయం తక్కువగా ఉన్నవారు 10 నిమిషాల పరుగు నుంచి కూడా ప్రయోజనం పొందవచ్చు. రోజూ 10 నిమిషాలు పరుగెత్తడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. బరువు కూడా వేగంగా తగ్గుతుంది. రోజూ పరుగెత్తడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Also Read :  చంపేస్తామంటూ.. బాబా సిద్దిఖీ కుమారుడికి బెదిరింపులు

గుండె ఆరోగ్యం:

  • రోజూ 10 నిమిషాలు పరుగెత్తడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో, గుండె పనితీరు మెరుగుపడుతుంది. కండరాలు రక్తాన్ని వేగంగా పంప్ చేస్తాయి. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.  

బరువు తగ్గడం: 

  • ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి నడక కంటే పరుగు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. రోజూ కొన్ని నిమిషాలు పరుగెత్తడం వల్ల కొవ్వు త్వరగా కరిగిపోయి బరువు తగ్గుతుంది. రన్నింగ్ ద్వారా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.   

Also Read :  అప్పుడేమో అలా... ఇప్పుడేమో ఇలా.. సాయి పల్లవి పై భారీ ట్రోలింగ్

సంతోషకరమైన హార్మోన్లు:

  • పరిగెత్తినప్పుడు శరీరంలో సంతోషకరమైన హార్మోన్లు పెరుగుతాయి. రన్నింగ్ HGH హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల శరీరం సంతోషంగా, ఆరోగ్యంగా ఉండటంతోపాటు వృద్ధాప్యాన్ని కూడా తగ్గించుకోవచ్చు. 

మంచి నిద్ర: 

  • నిద్ర సమస్యలు ఉన్నవారు రోజూ పరుగెత్తడం వల్ల ప్రయోజనం పొందుతారు. రన్నింగ్ నిద్ర, నిద్ర విధానం, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. రన్నింగ్, కార్డియో వ్యాయామం రాత్రిపూట లోతైన, మంచి నిద్రను పొందుతారు.

ఎముకలు- కండరాలకు మంచిది: 

  • రన్నింగ్ గుండె సంబంధిత ప్రయోజనాలను, కండరాలు, కీళ్లను బలపరుస్తుంది. రెగ్యులర్ రన్నింగ్ కాళ్ళు, కోర్ కండరాల బలాన్ని పెంచుతుంది. రన్నింగ్ గ్రోత్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది.

Also Read :  ఏపీలో 32 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: వాటర్ ఫాస్టింగ్‌తో త్వరగా బరువు తగ్గొచ్చా..?

Advertisment
Advertisment
తాజా కథనాలు