Custard Apple: ఈ సీజనల్ ఫ్రూట్ అతిగా తిన్నారో.. అంతే సంగతి ఇక!

సీజనల్‌గా దొరికే సీతాఫలాలను అతిగా తినడం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా వీటిని తింటే జలుబు, దగ్గు, కడుపు, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని కాబట్టి అతిగా వీటిని తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

New Update
Custard Apple Health Benefits: మధుమేహం ఉన్నవారు సీతాఫలాలు తినొచ్చా?

సీజనల్‌గా లభ్యమయ్యే సీతాఫలం పండ్లు అంటే అందరూ ఇష్టంగానే తింటారు. రుచిగా ఉండటంతో పాటు ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఆరోగ్యానికి మంచిదని, కేవలం సీజన్‌లో మాత్రమే లభ్యమవుతుందని వీటిని అతిగా తింటారు. ఇలా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయిని నిపుణులు అంటున్నారు. మరి అతిగా సీతాఫలం తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలియాలంటే ఓ లుక్కేయండి. 

ఇది కూడా చూడండి:  టీతో సిగరెట్ తాగితే ఎంత ప్రమాదమో మీకు తెలుసా?

ఆరోగ్యానికి మంచిదే కానీ..

తినడానికి రుచిగా ఉండే సీతాఫలంలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నిషియం వంటి ఖనిజ పోషకాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని భావిస్తారు. కానీ ఇలా అనుకుంటే పొరపాటే అని నిపుణులు అంటున్నారు. అతిగా సీతాఫలం తింటే దగ్గు, జలుబు దీర్ఘకాలికంగా బాధపడతారని నిపుణులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: ఇన్‌స్టాగ్రామ్‌ మోజులో పడి ప్రాణాలు తీసుకున్న వివాహిత.. ఏమైందో తెలుసా

అలాగే చర్మ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ పండ్లను తింటే శరీరంపై ఎర్రటి దద్దర్లు, దురద వచ్చే ప్రమాదం ఉంటుందట. చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారు సీతాఫలాలను అతిగా తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సీజన్‌లో మాత్రమే లభిస్తాయని భావించి తినవద్దు. 

ఇది కూడా చూడండి:  శారదా పీఠానికి షాక్.. భూ కేటాయింపులు రద్దు

సీతాఫలంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కడుపు సంబంధింత సమస్యలో బాధపడేవారు వీటిని అతిగా తీసుకోవడం వల్ల సమస్య తీవ్రం అవుతుంది. అలాగే విరేచనాలు, వాంతులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నరాల సమస్యలు, డయాబెటిస్, ఆస్తమాతో ఇబ్బంది పడేవారు సీతాఫలాలను తక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:  ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీకొనడంతో ఇద్దరు స్పాడ్ డెడ్

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు