ఈ జ్యూస్‌తో ఆరోగ్యంగా బరువు తగ్గండిలా!

కూరల్లో విరివిగా వాడే కొత్తిమీరను జ్యూస్ చేసి రోజూ ఉదయం తాగితే ఈజీగా బరువు తగ్గుతారు. వీటితో పాటు జీర్ణ సమస్యలు, మలబద్ధకం తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

author-image
By Kusuma
New Update
coriander juice

మారుతున్న జీవనశైలి వల్ల చాలా మంది ఊబకాయం బారిన పడుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం, శారీరక వ్యాయామం వంటివి లేకపోవడం వల్ల బరువు పెరుగుతున్నారు. దీనికోసం కొందరు మందులు వాడుతుంటారు. మార్కెట్లో దొరికే మందులు వాడటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవి లేకుండా ఈజీగా బరువు తగ్గాలంటే కొన్ని ఈ గ్రీన్ జ్యూస్ తాగాల్సిందే. 

ఇది కూడా చూడండి: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్‌ వైరల్‌!

రోజూ ఉదయం ఈ జ్యూస్‌ తాగితే..

భారతీయ వంటకాల్లో కొత్తిమీరను ఎక్కువగా వాడుతారు. ఇది ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు వంటలు టేస్టీగా కూడా ఉంటాయి. ఇందులోని పోషకాలు బరువు తగ్గడానికి బాగా సహాయపడతాయి. డైలీ ఉదయం పూట ఈ జ్యూస్‌ను తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. అలాగే ఈ జ్యూస్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ఇది కూడా చూడండి:  బద్దశ‌త్రువుకు కీలక పదవి ఇచ్చిన చంద్రబాబు.. వ్యూహం అదేనా?

ఉబ్బరం, అల్సర్ వంటి సమస్యలు కూడా తగ్గు్తాయి. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా సహాయపడతాయి. అలాగే చర్మంపై ఉండే మంటను కూడా తగ్గించడంతో పాటు మొటిమలను తొలగిస్తుంది. రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచడంతో పాటు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వీటితో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం, మలబద్ధకాన్ని తగ్గించడంలో కూడా ఇది బాగా సహాయపడుతుంది. 

ఇది కూడా చూడండి:  AR Rahman : అసిస్టెంట్ తో రెహమాన్ ఎఫైర్.. అందుకే విడాకులు..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. 

ఇది కూడా చూడండి: షమీ-మంజ్రేకర్ మధ్య ఐపీఎల్ వివాదం.. దాన్ని దాచుకోమంటూ కౌంటర్స్!

Advertisment
Advertisment
తాజా కథనాలు