/rtv/media/media_files/2025/03/20/YTdHgemO8kxZja7mc8sJ.jpg)
COCKROACH MILK
పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా ఆవు పాలు అయితే కండరాలు, ఎముకలను బలంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కొందరు ఆవు పాలు లేదా గేదె, మేక పాలు కూడా తాగుతుంటారు. వీటిలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పాల కంటే బొద్దింక పాలలో మూడు రెట్లు పోషకాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: USA: శాంతి ఒప్పందంపై జెల్స్ స్కీ కు ట్రంప్ కాల్..సుదీర్ఘ చర్చ
బొద్దింక పాలలో పోషకాలు ఉన్నట్లు 1997లో పరిశోధకులు తెలిపారు. వీటిలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఒక కీటకం పాలు మనుషులు తాగవచ్చా? తాగితే ఏం కాదా? ఈ బొద్దింక పాల వల్ల మనుషులకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: HYD: ఎల్బీ నగర్ లో దారుణం..బైక్ ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన కారు
పోషకాలు ఎక్కువ..
ఆవు, గేదె పాల కంటే బొద్దింక పాలలో మూడు రెట్లు కేలరీలు ఎక్కువగా ఉంటాయి. సూపర్ ఫుడ్స్‌గా బొద్దింక పాలను గుర్తిస్తారు. బొద్దింక పసుపు రంగులో ఉండే ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఇది గట్టిపడి స్ఫటికాల రూపాన్ని తీసుకుంటుంది. వీటినే బొద్దింక పాలు అని అంటారు. ఈ బొద్దింక పాలలో అధిక మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, కేలరీలు ఉంటాయి.
ఇది కూడా చూడండి: AP: ఆంధ్రాలో మరో సామూహిక అత్యాచారం..మైనర్ ను మూడు రోజులు నిర్భంధించి...
బొద్దింక పాలను మనుషులు తాగడానికి తయారయ్యే విధంగా లేవు. కేవలం బొద్దింక మాత్రమే ఆ పాలను తన పిల్లలకు ఇస్తుంది. వీటిని మనుషులు తీసుకోకూడదు. ఒకవేళ మనుషులు తీసుకోవాలని ప్రయత్నించినా కూడా భారీ సంఖ్యలో బొద్దింకలను చంపి తయారు చేయాలి. ఇప్పటి వరకు మనుషులు తాగే విధంగా బొద్దింక పాలను తయారు చేయలేదు. భవిష్యత్తులతో తయారు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Google Pixel 9a: వచ్చేసింది వచ్చేసింది.. కిక్కిచ్చే కిర్రాక్ ఫోన్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!