Bird Flu In Chickens: బర్డ్ ఫ్లూ సోకిన కోడి కూర తింటే.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను తింటే.. మనుషులకు బర్డ్ ఫ్లూ సోకుతుందా అనే సందేహం చాలామందిలో ఉండే ఉంటుంది. బర్డ్ ఫ్లూ సోకిన కోడి మాంసం తినడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అయినప్పటికీ మాంసం బాగా ఉడికించి తినవచ్చు.

New Update
bird flue

bird flue Photograph: (bird flue)

Bird Flu In Chickens: చికెన్ లవర్స్ వారానికి రెండుసార్లు కంటే ఎక్కువే నాన్‌ వెజ్ తింటుంటారు. గతంలో నాటు కోళ్లు మాత్రమే ఉండేవి. ఫౌల్ట్రీ పరిశ్రమ డెవలప్ అయిన తర్వాత చికెన్ తినేవారి సంఖ్య పెద్ద ఎత్తున పెరిగింది. అయితే ఈ ఫౌల్ట్రీ పరిశ్రమలో పెంచే కోళ్లను వ్యాక్సిన్స్ వేసి, స్టెరాయిడ్స్ ఇచ్చి పెంచుతుంటారు. వీటికి బ్లడ్ ఫ్లూ సోకే అవకాశాలు ఉన్నాయి. బర్డ్ ఫ్లూ సోకితే పౌల్ట్రీ ఫాంలో కోళ్లు చనిపోతాయి. కోట్లలో రైతులు నష్టపోతుంటారు. అయితే బర్డ్ ఫ్లూ ఎక్కువగా వేసవిలో సోకుతుంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పౌల్ట్రీ ఫాం రైతులు భారీ నష్టపోతున్నారు. 15వేలకు పైగా కోళ్లు చనిపోయాయి. ఇది పక్షుల నుంచి మనుషులకు కూడా వ్యాపిస్తోంది. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను తింటే.. మనుషులకు బర్డ్ ఫ్లూ సోకుతుందా అనే సందేహం చాలామందిలో ఉండే ఉంటుంది. ఈ విషయంలో డాక్టర్లు ఏం అంటున్నారో తెలుసుకుందాం..

Also Read: Cummins: కోహ్లీ ఇజ్జత్ తీసిన ఆసీస్ కెప్టెన్.. ఛాంపియన్ ట్రోఫీ నుంచి ఔట్!

బర్డ్ ఫ్లూ సోకిన కోడి మాంసం, గుడ్లు వల్ల ఈ వ్యాధి సోకుతుందేమోనని ప్రజలు భయందోళన చెందుతున్నారు. నిజానికి, బర్డ్ ఫ్లూను ఏవియన్ ఇన్‌ఫ్లూఎంజా అని కూడా పిలుస్తారు. ఇది పక్షులకే కాకుండా మనుషులకు, ఇతర జంతువులకు కూడా సోకే వైరస్. దీంతో బర్డ్ ఫ్లూ సోకిన కోడి మాంసం తినడం సురక్షితమేనా? అనే సందేహం అందరికీ వస్తుంది. బర్డ్ ఫ్లూ సోకిన కోడి మాంసం తినడం తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అయినప్పటికీ మాంసం బాగా ఉడికించి తినవచ్చు. సరిగా ఉడికించకపోతే వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి వంట చేసేటప్పుడు మరింత శుభ్రత పాటించాలి. పచ్చి చికెన్‌ని శుభ్రం చేసిన తర్వాత చేతులు, పాత్రలు శుభ్రం చేసుకోవాలి. అలాగే గుడ్లు వండేటప్పుడు కూడా ఈ జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. అనారోగ్యంతో ఉన్న పక్షులను లేదా కోళ్లను ముట్టుకోకూడదు. వీటికి వీలైనంత దూరంగా ఉండాలి.

Also Read: Delhi: ఢిల్లీ ఎన్నికల పోలింగ్  షురూ..కేజ్రీవాల్ పై హర్యానాలో ఎఫ్ ఐఆర్

బర్డ్ ఫ్లూ లక్షణాలు..

బర్డ్ ఫ్లూ వైరస్‌ సోకిన 2 నుండి 8 రోజుల తర్వాత దీని లక్షణాలు కనిపిస్తాయి. జలుబు వల్ల ముక్కు మూసుకుపోవడం, గొంతు నొప్పి, దగ్గు వంటి శ్వాసకోశ లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి తలనొప్పి, జ్వరం, అలసట, కండరాల నొప్పులు, వికారం, వాంతులు, విరేచనాలు వంటి జీర్ణ లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ తీవ్రం అధికంగ ఉంటే అవయవ వైఫల్యం, న్యుమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయి.

Also Read: పాపం పెళ్లై మూడు నెలలు కూడా కాలేదు..ఎంతకు తెగించార్రా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు