/rtv/media/media_files/2025/02/20/0PqgXmIpyScUNeyM6cBW.jpg)
Asafoetida Photograph: (Asafoetida )
చాలా మంది ఇంగువను వంటల్లో ఎక్కువగా వాడుతుంటారు. అలాగే కొన్ని పిండి వంటల్లో కూడా దీన్ని వాడుతారు. అయితే ఇంగువను వంటలు టేస్ట్ ఇవ్వడం మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇంగువలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని పప్పు, పులిహోర, సాంబార్‌లో వేయడం వల్ల వంటలు టేస్టీగా ఉండటంతో పాటు తలనొప్పి కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?
దగ్గు, జలుబు వంటి సమస్యలు..
ప్రస్తుతం చాలా మంది మైగ్రేన్ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ వేసి తాగితే.. మైగ్రేన్ సమస్య క్లియర్ అయిపోతుంది. అలాగే దగ్గు, జలుబు వంటి సమస్యలు కూడా క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. చిటికెడు ఇంగువ పొడిలో తేనె, అల్లం రసం కలిపి తీసుకోవడం వల్ల శ్వాస కోశ సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి.
ఇది కూడా చూడండి: BRS vs Congress: రాజలింగమూర్తి హత్య కేసుపై స్పందించిన గండ్ర వెంకట రమణారెడ్డి..
ఇంగువలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పీరియడ్స్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లయితే ఇంగువ వాటర్‌ను తాగడం వల్ల సమస్య తగ్గుతుంది. అలాగే గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు కూడా క్లియర్ అవుతాయి. ఇంగువను గ్లాసు నీటిలో వేసుకుని తాగడం వల్ల కడుపులోని ఇన్ఫెక్షన్ అంతా కూడా క్లియర్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు కోసం దీనికి సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.
ఇది కూడా చూడండి: HYDRAA Jobs: హైడ్రాలో 357 ఉద్యోగాలు.. ఆ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక!