40 ఏండ్లకే మాయరోగాలు.. ఆకస్మిక హార్ట్ ఎటాక్‌లకు కారణమిదే..!!

ఆధునిక యుగంలో మనిషి జీవనశైలి మారుతోంది. ఉరుకులు పరుగుల జీవితంలో బిజీబిజీగా గడుపుతూ.. సరైన తిండి, నిద్ర లేకుండా పనిచేస్తూ.. మనిషి తనకు తానే రోగాలకు వెల్ కమ్ చెబుతున్నాడు. నిండా 40 దాటకముందే.. నయంకాని మాయరోగాల బారిన పడుతున్నాడు.

New Update
Diabetes: ఇలా చేస్తే షుగర్ రమ్మన్నా రాదట..!!

Health Issues: ఆధునిక యుగంలో మనిషి జీవనశైలి మారుతోంది. ఉరుకులు పరుగుల జీవితంలో బిజీబిజీగా గడుపుతూ.. సరైన తిండి, నిద్ర లేకుండా పనిచేస్తూ.. మనిషి తనకు తానే రోగాలకు వెల్ కమ్ చెబుతున్నాడు. నిండా 40 దాటకముందే.. నయంకాని మాయరోగాల బారిన పడుతున్నాడు. మానవ శరీరం కూడా ఓ మిషన్ లాంటిదే.. మంచి నిద్ర, ఆహారం, శారీరక శ్రమ వంటి అన్ని పనిముట్లు సరిగా ఉంటే ఆ మిషన్ సవ్యంగా పనిచేస్తుంది. ఏ ఒక్క 'పరికరం' పనిచేయకపోయినా.. మిషన్ మూలపడడమో, లేదంటే పనికి రాకుండా పోవడమే జరుగుతోంది.

రెండు వారాల క్రితం.. ముంబైకి చెందిన 34 ఏండ్ల వ్యక్తి తన జనరల్ ఫిజిషియన్ సలహా మేరకు.. ఓ డయాబెటాలజిస్ట్ దగ్గరకెళ్లాడు. అనుమానంతో అతని షుగర్, బీపీ లెవల్స్ చెక్ చేయగా.. రిపోర్ట్‌లలో సాధారణం స్థాయి కన్నా.. బీపీ(BP) 210/110 mmHg, షుగర్(Sugar) 300 mg/dL గా వచ్చాయి. వచ్చిన రిపోర్ట్స్‌తో ఆ వ్యక్తి షాకవ్వగా.. అతని లైఫ్ స్టైల్ వల్లే అతని శరీరంలో ఇన్ని మార్పులు చోటుచేసుకున్నట్లు డాక్టర్ తెలిపాడు. ఆ విషయం నమ్మని ఆ వ్యక్తి తాను మరో ల్యాబ్ లో టెస్ట్ చేయించుకొని , రిపోర్ట్స్ సరిచూసుకుంటానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

చైనీస్ రెస్టారెంట్ నడిపే ఆ వ్యక్తి.. రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా తెల్లవారుజామున 5 వరకూ ఫుడ్ డెలీవరీలు చేస్తూ తన ఆరోగాన్ని(Health) తానే పాడుచేసుకున్నాడని, ఇలా పనిచేస్తే... 60 ఏండ్ల వరకూ కాదు.. 40 లోపే భయంకర రోగాలు వస్తాయని తెలిపారు. ఈ రిమోట్ వర్కింగ్ యుగంలో మనిషి.. ఒత్తిడి, అనారోగ్యకరమైన(Unhealthy) ఆహారపు అలవాట్లు, నిద్ర విధానాలు, ఆల్కహాల్ నుంచి స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు వరకు ప్రతిదానికీ బానిసగా మారి తనను సర్వనాశనం చేసుకుంటున్నారని వైద్యులు అంటున్నారు. ఈ వ్యాధులకు కారణం మనిషి స్వయంకృత అపరాధాలే. ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు చాలామందిలో నమోదవుతున్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు.

జాతీయ గణాంకాల ప్రకారం.. 2019, 2021 మధ్య కాలంలోనే, 31 మిలియన్ల మంది భారతీయులు షుగర్ పేషెంట్లుగా మారగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 77 మిలియన్లుగా ఉంది. 2045 నాటికి 134 మిలియన్లకు చేరుకుంటాయని ఆ సర్వేలు అంచనా వేస్తున్నాయి. మధుమేహం, ఊబకాయం, గుండెపోటు వంటి సమస్యలకు మధ్య ఉన్న సంబంధమేంటో అందరికీ తెలిసిందే. ముంబై నటుడు 40 ఏళ్ల సిద్ధార్థ్ శుక్లా , కన్నడ నటుడు 35 ఏళ్ల చిరంజీవి సర్జాలతో పాటు జిమ్‌, పార్క్‌లలో వర్క్ చేస్తూ ఇటీవల చనిపోయిన ఎంతోమంది యువకుల అకాల మరణాలకు షుగర్ లెవల్స్ కూడా ఓ కారణం. భారతదేశంలోని మొత్తం మరణాలలో నాల్గవ వంతుకి కారణమయ్యే గుండె సంబంధ వ్యాధులపై ఈ షుగర్ లెవల్స్ ప్రభావం చూపుతున్నాయి.

గుండెపోటులు

ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, భారతీయ పురుషులలో సగం మందికి 50 ఏళ్లలోపు గుండెపోటులు సంభవిస్తున్నాయి. గుండెపోటులో నాలుగింట ఒక వంతు 40 ఏళ్లలోపే సంభవిస్తుంది. AIIMS కార్డియోథొరాసిక్ , న్యూరో సెంటర్ తాజాగా తెలిపిన వివరాల ప్రకారం.. ఇలాంటి ఆహారపు అలవాట్లు, జీవన శైలి వల్ల ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే ఒక దశాబ్దం ముందుగానే భారతీయ శరీరాల్లో గుండె జబ్బులు వస్తాయని పేర్కొంది.

ఇలాంటి జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా.. మీ కుటుంబానికి మీరు దూరం కాకుండా ఉండాలంటే సమతుల్య ఆహారంతో పాటు మితమైన వ్యాయామం తప్పనిసరి అంటున్నారు డాక్టర్లు. ప్రతిరోజూ కనీసం 10,000 అడుగులు నడవాలని, కనీసం ఏడు గంటలు నిద్రించాలని, పని చేసే చోట తక్కువ ఒత్తిడి ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. తోటి వ్యక్తులతో సరదగా సంభాషిస్తూ.. ఎక్కువగా నవ్వడానికి ప్రయత్నించాలంటున్నారు.

Also Read: కడుపు నిండా తిన్నా ఇంకా ఆకలిగా అనిపిస్తోందా? తస్మాత్ జాగ్రత్త

Advertisment
Advertisment
తాజా కథనాలు