Hyderabad : మళ్లీ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో చిరుత కలకలం

శంషాబాద్‌లో ఎయిర్‌ పోర్ట్‌లో చిరుత ఇంకా భయపెడుతూనే ఉంది. ఐదురోజులుగా తప్పించుకుని తిరుగుతున్న లెపర్డ్ మరోసారి ఎయిర్‌పోర్టు రన్‌వే పైకొచ్చింది. దీనిని పట్టుకుందామని ఎంతలా ప్రయత్నిస్తున్నా తప్పించుకుంటోంది.

New Update
Hyderabad : మళ్లీ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో చిరుత కలకలం

Shamshabad Air Port : శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో చిరుత(Leopard) పెద్ద సమస్యగా తయారయింది. ఐదు రోజులుగా అక్కడే తిరుగుతోంది కానీ పట్టుకుందామంటే చిక్కడం లేదు. ఈరోజు రన్‌వే సమీపంలో ఏర్పాటుచేసిన ట్రాప్‌ కెమెరాలకు మళ్ళింది చిక్కింది చిరుత. 6 రోజుల క్రితం కూడా ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేపైనే కనిపించింది. అప్పటి నుంచి దాన్ని పట్టుకుందామని ఎయిర్ పోటర్ సిబ్బంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆపరేషన్ చిరుత(Operation Cheetah) పేరుతో ప్రత్యేక బృందాలు కూడా వచ్చాయి. అయినా కూడా 6 రోజుల నుంచి చిక్కకుండా అధికారులకు ముప్పు తిప్పలు పెడుతోంది.

బోన్లు..ట్రాప్‌లు, ప్రత్యేక బృందాలు..

చిరుతను బంధించేందుకు రోజురోజుకూ అటవీశాఖాధికారులు బోన్ల సంఖ్యను పెంచుకుంటే వెళుతున్నారు. ఆరు రోజులుగా చిరుత ఎయిర్ పోర్ట్ సిబ్బందికి , ప్రత్యేక బృందాలకు చిక్కడమే లేదు. ఇప్పటికే 5 బోన్లు, 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినప్పటికీ అది మాత్రం తప్పించుకుంటోంది. అన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత ఉన్నట్టు కనిపిస్తోంది. దానికి తోడు చిరుతను పట్టుకోవడానికి బోనులో మేకను ఎరగా కూడా వేశారు. అయితే అది మాత్రం చాలా తెలివిగా బోను వరకు వస్తోంది కానీ అందులోకి దూరడం లేదు. మేకను చూసి కూడా లోపలికి రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ఒకే ప్రాంతంలో తిరుగుతోంది కానీ ట్రాప్‌కు మాత్రం దొరకడం లేదు.

చెట్లలో దాక్కుని...

ఎయిర్‌పోర్టు పక్కన చెట్ల మధ్యలో చిరుత దాక్కుని ఉందని అటవీశాఖ ప్రత్యేక బృందాలు చెబుతున్నాయి. చిరుతను బంధించేందుకు 5 బృందాలుగా అధికారులు గాలిస్తున్నారు. ట్రాప్‌ కెమెరా విజువల్స్‌(Trap Camera Visuals) ఆధారంగా పులి సంచరిస్తున్న 2 ప్లేసులు గుర్తించారు.ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందో నిఘా వేశారు. దాని బట్టి ఇవాళ కచ్చితంగా చిరుతను పట్టుకుంటామంటున్నారు ఫారెస్ట్‌ అధికారులు.

Also Read:Congress: అమేథీ, రాయ్‌బరేలీ కాంగ్రెస్‌ అభ్యర్థులపై వీడని సస్పెన్స్‌

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: గుజరాత్‌లో కూప్పకూలిపోయిన విమానం.. భారీ పేలుడు

గుజరాత్‌లో మంగళవారం విమానం కూలిపోయి పైలట్ మరణించాడు. అమ్రేలి జిల్లా గిరియా ప్రాంతంలో ఓ ప్రైవేట్ ప్లేన్ క్రాష్ అయ్యింది. ట్రైనీ పైలట్ సోలో అనికేత్ మహాజన్ అక్కడికక్కడే మరణించాడు. ఫ్లైట్‌లో ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.

New Update
Plane Crashes in Amreli

గుజరాత్‌లో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అమ్రేలి జిల్లా గిరియా ప్రాంతంలో ఓ ప్రైవేట్ ఫ్లైట్ కుప్పకూలిపోయింది. విమానం కూలిపోగానే భారీ పేలుడు సంభవించింది. పైలట్‌కు ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రైనీ పైలట్ సోలో అనికేత్ మహాజన్ అక్కడికక్కడే మరణించాడు. ఫ్లైట్‌లో ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు.

Also read: New Pope: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్

ప్లేన్ క్రాష్ అవ్వడంతో చుట్టుపక్కల ప్రాంతంలో భయానక వాతావరణం ఏర్పడింది. అగ్నిమాపక శాఖ, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కొంతకాలం క్రితం ట్రైనీ లేడీ పైలట్‌ నడుపుతున్న విమానం మెహ్సానాలోని ఒక గ్రామ శివార్లలో కూలిపోయింది. ఆప్రమాదంలో ఆ మహిళా పైలట్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.

Advertisment
Advertisment
Advertisment